కడప జిల్లాలోని చాపాడు మండలంలో ఖాదరపల్లె గ్రామం ఉంది.

1980 వరకు అదో పేద గ్రామం. కానీ, ఓ వ్యక్తి చూపిన దారి ఆ గ్రామం భవిష్యత్తును మార్చేసింది.

1978లో ఖాదర్‌ పల్లెకు చెందిన మహమ్మద్‌ దౌలా ఉపాధి కోసం గల్ఫ్‌ వెళ్లాడు.

ఆర్థికంగా బాగా నిలదొక్కుకున్నాడు. తర్వాత ఆయన బాటలోనే ఊరి వాళ్లు నడిచారు.

ఇప్పుడు 300 మంది గల్ఫ్‌ దేశాలకు వెళ్లి ఉద్యోగాలు చేస్తున్నారు.

పనులను బట్టి నెలకు 20 వేల నుంచి 2 లక్షల రూపాయల వరకు సంపాదిస్తున్నారు.

ఎంత ఎదిగినా ఊరిని మర్చిపోవటం లేదు. గ్రామ అభివృద్ది కోసం ఎంతో కృషి చేస్తున్నారు.

ముస్లిం సోదరులంతా కోటి రూపాయలు సేకరించారు. అద్భుతమైన మసీదును నిర్మించుకున్నారు.

గల్ఫ్‌ దేశాల్లో ఉన్న వారంతా ఎంతో అన్యోన్యంగా ఉంటారు. కష్టసుఖాలను పంచుకుంటూ ఉంటారు.