పెళ్లయ్యాక భార్య ఖాళీగా ఇంట్లో కూర్చోకూడదని కర్ణాటక హైకోర్టు తీర్పు ఇచ్చింది.
బెంగళూరు అర్బన్ జిల్లాలోని అనేకల్ సిటీకి చెందిన ఓ మహిళ హైకోర్టులో పిటిషన్ వేసింది.
ఆ మహిళ తన భర్త నుంచి విడాకులు తీసుకున్న తర్వాత భరణం సరిపోలేదని కోర్టులో పిటిషన్ వేసింది.
ఆ పిటిషన్ ని విచారించిన హైకోర్టు ఆ పిటిషన్ ను కొట్టివేసింది.
ఆ మహిళ భర్త నుంచి విడిపోయాక పరిహారంగా రూ. 3 లక్షలు, మెయింటెనెన్స్ కింద రూ. 10 వేలు ఇవ్వాలని జిల్లా మేజిస్ట్రేట్ కోర్టు తీర్పు ఇచ్చింది.
అయితే ఆ భరణాన్ని తగ్గిస్తూ సెషన్స్ కోర్టు తీర్పు ఇచ్చింది. పరిహారాన్ని రూ. 2 లక్షలకు, మెయింటెనెన్స్ ని రూ. 5 వేలకు తగ్గిస్తూ తీర్పు ఇచ్చింది.
దీంతో ఆ మహిళ సెషన్స్ కోర్టు తీర్పును ఛాలెంజ్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేసింది.
అయితే ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు న్యాయమూర్తి రాజేంద్ర సెషన్స్ కోర్టు తీర్పును సమర్ధించారు.
అంతేకాదు గతంలో ఉద్యోగం చేసిన భార్యలు ఇంట్లో ఖాళీగా ఉండకూడదని అన్నారు.
గతంలో ఉద్యోగం చేసి ఉండి పెళ్లయ్యాక మానేసి.. విడాకులు తీసుకుని భర్త నుంచి భరణం తీసుకోవాలనుకునే మహిళలు ఉద్యోగం చేసుకుని బతకాలని అన్నారు.
అసలు మాజీ భర్త ఎందుకు భరణం ఇవ్వాలన్న ప్రశ్నకు ఆ మహిళ సరైన సమాధానం చెప్పలేకపోయింది.
పెళ్ళికి ముందు ఉద్యోగం చేసి ఆ పెళ్లయ్యాక ఉద్యోగం మానేయడం కరెక్ట్ కాదని.. భార్య కూడా లీగల్ గా ఉద్యోగం చేయాలని హైకోర్టు పేర్కొంది.
ఆ మహిళ తన అత్త గారితో గానీ మాజీ భర్త సోదరితో ఉండడానికి ఇష్టపడలేదని కోర్టు గమనించి పిటిషన్ ను కొట్టివేసింది.
తల్లి, సోదరి సంరక్షణ బాధ్యతలు భర్తదే కాబట్టి ఈ పిటిషన్ ను కొట్టివేస్తున్నట్లు న్యాయస్థానం వెల్లడించింది.