అప్సర హత్య కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
ఈ కేసులో నిందితుడిగా ఉన్న పూజారి సాయికృష్ణకి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది.
పోలీసులు నిందితుడు సాయికృష్ణను శుక్రవారం రాత్రి చర్లపల్లి జైలుకి తరలించారు.
అసలు అప్సర పోస్ట్ మార్టం రిపోర్టులో ఏం తేలనుందని పోలీసులతో పాటు అందరూ వెయిట్ చేశారు.
అప్సర మృతదేహానికి వైద్యులు ఉస్మానియా ఆస్పత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించారు.
అదే రిపోర్టును వైద్యులు తాజాగా పోలీసుల చేతికి అందించారు.
ఈ రిపోర్టులో మాత్రం కొన్ని కీలక విషయాలు బయటపడ్డాయి.
ఈ రిపోర్టులో మాత్రం కొన్ని కీలక విషయాలు బయటపడ్డాయి.
అప్సర పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కొన్ని కీలక విషయాలు వెలుగు చూశాయి.
నిందితుడు పూజారి సాయికృష్ణ ప్రియురాలు అప్సర తలపై బలంగా బాదాడు.
దీంతో ఆమె తలకు బలమైన గాయమైనట్లు వైద్యులు పోస్ట్ మార్టం రిపోర్టులో ప్రకటించారు.
తలకు బలమైన గాయం అయిన కారణంగానే ఆ యువతి ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు రిపోర్టులో వెల్లడించారు.
అనంతరం పోలీసులు అప్సర డెడ్ బాడీని ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు.