నేటి కాలంలో చాలా మంది వయసు కనిపించకుండా ఫిట్ గా కనిపించాలని అనేక ప్రయత్నాలు చేస్తుంటారు.

 దీని కోసం కొందరు యోగా, జిమ్ చేస్తుంటే మరి కొందరు గేమ్స్ ఆడుతుంటారు.

ఇలా ఎవరికి వారు సమయానుకూలతను బట్టి అందుబాటులో ఉన్న వాటికి ప్రయారిటీ ఇస్తుంటారు.

ఒక రకంగా వ్యాయమాలు చేయడం ఆరోగ్యానికి కూడా మంచిది కావడంతో అందరూ ఉదయం పూట ఎక్సర్ సైజ్ లు చేస్తుంటారు.

అయితే జిమ్ కు వెళ్లలేని వారు మాత్రం ఇంట్లోనే ఇలా చేస్తే ఫిట్ గా కనిపించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఎలాంటి పరికరాలు లేకుండానే ఇంట్లోనే చేయవచ్చని కూడా చెబుతున్నారు.

 జిమ్‌కి వెళ్లకుండా ఫిట్‌గా కనిపించాలంటే నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పడు తెలుసుకుందాం.

పెరిగిన శరీర బరువుని తగ్గించుకోవడంతో పాటు ఫిట్ గా కనిపించేందుకు పుష్ అప్స్ చేయాలని చెబుతున్నారు.

 ఫిట్ గా కనిపించాలంటే రోజువారి వ్యాయమంలో ప్లాంక్ ని కూడా చేర్చుకోవాలట.

 ఉదయం లేదా సాయంత్రం ఈ వ్యామయం చేయడం ద్వారా ఫిట్ గా మారిపోయే అవకాశాలు లేకపోలేదు.

 తొడల భాగాల్లో పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి డాంకీ కిక్స్ చాలా ముఖ్యమైనది. దీనిని రోజూ చేయడం ద్వారా కొవ్వును కరిగించవచ్చని నిపుణుల సూచిస్తున్నారు.

ఇక ఫిట్ గా కనిపించేందుకు ఊపిరితిత్తుల వ్యాయామం కూడా ముఖ్యమైనదట.

దీనిని రోజూ చేయడం ద్వారా శరీరం దిగువున ఉన్న నడుము, పొట్ట, తొడ భాగాల్లో ఉన్న కొవ్వుని కరిగించడానికి వీలు ఉంటుందట.

 ఇలా రోజువారి వ్యాయమంలో ఇవి చేయడం ద్వారా జిమ్ కు వెళ్లకుండా ఫిట్ గా కనిపించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

మరి ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ట్రై చేయండి.