రాకేష్ శశి తెరకెక్కించిన ఈ సినిమాను ధీరజ్ మొగిలినేని, బన్నీ వాసు నిర్మించారు
రొమాంటిక్ కామెడీ మూవీగా వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం!
వీరిద్దరూ ఒకే ఆఫీస్ లో కొలీగ్స్. ఇద్దరివీ డిఫరెంట్ గోల్స్.. ఓరోజు సింధుతో పార్టీకి వెళ్లి.. శారీరకంగా దగ్గరై లవ్ ప్రపోజ్ చేస్తాడు శ్రీ.
కానీ.. అది లవ్ కాదని, క్యాజువల్ అని షాకిస్తుంది సింధు. దీంతో అటు పేరెంట్స్ చూస్తున్న అరేంజ్ మ్యాచెస్, ఇటు ప్రేమించిన అమ్మాయి అనే డైలామాలో పడతాడు శ్రీ.
ఇలాంటి తరుణంలో అనుకోని సంఘటనల వల్ల.. శ్రీ లైఫ్ లోకి వేరే అమ్మాయి ఎంటర్ అవుతుంది
మరి అంతలా ప్రేమించుకున్న శ్రీ, సింధుల లవ్ స్టోరీ ఏమైంది? శ్రీ లైఫ్ లోకి వేరే అమ్మాయి ఎలా వచ్చింది? అనేది తెరపై చూడాల్సిందే.
ఈ సినిమా ట్రైలర్ లో చూపించినట్లు రొమాన్స్, కామెడీ అంశాలతో సాగుతుంది. తమిళంలో సూపర్ హిట్టయిన ‘ప్యార్ ప్రేమ కాదల్’ మూవీకి ఇది రీమేక్.
ఈ సినిమాలో ప్రస్తుతం ఉన్న ట్రెండ్.. మోడరన్ లైఫ్ స్టైల్.. నలిగిపోతున్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్.. వారి ఎమోషన్స్ ఇలా అన్ని పాయింట్స్ టచ్ చేశారు
ఫిజికల్ గా కలిశాక.. అమ్మాయిలు ఇది లవ్ కాదు, క్యాజువల్ అని.. ఫ్రెండ్స్ గా మూవ్ అవుదాం అని చెప్పే సన్నివేశాలు.. ఇప్పటి మోడరన్ లైఫ్ అమ్మాయిల మైండ్ సెట్ ని ప్రెజెంట్ చేస్తాయి
కానీ.. ప్రేమించిన అమ్మాయితో అన్ని జరిగాక.. ఫ్రెండ్స్ గా ఉండటం అనేది అబ్బాయిలు భరించలేరు! ఈ పాయింట్ ని కూడా చక్కగా చూపించారు
రొమాంటిక్ సీన్స్ యూత్ అంటే ఎంజాయ్ చేస్తారేమో! ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా దృష్టిలో పెట్టుకుని కొన్ని ట్రిమ్ చేసుంటే బాగుండేది అనిపిస్తుంది
లీడ్ క్యారెక్టర్స్ లో అల్లు శిరీష్, అను ఇమ్మానుయేల్ బాగా నటించారు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. అచ్చు రాజమణి మ్యూజిక్, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి
చివరిమాట: యూత్ కి మాత్రమే నచ్చే రొమాంటిక్ డ్రామా!