ఈగో అనేది మనిషి వ్యక్తిత్వంలో భాగమే..

మనిషి వ్యక్తిత్వంలో మొత్తం మూడు భాగాలు ఉంటాయి.

1) ఐడీ

2) ఈగో

3) సూపర్‌ ఈగో

ఐడీలో మనిషికి ఎలాంటి ఈగోలు ఉండవు. అప్పుడే పుట్టిన పిల్లాడి మనస్తత్వం అని చెప్పొచ్చు.

పిల్లలు పెరిగి పెద్ద అయ్యే కొద్ది ఈగోలు మొదలవుతాయి.

ఈగోల విషయంలో మంచి, చెడుల ప్రసక్తి ఉండదు. వీటికి సంబంధించినంత వరకు మనిషికి ఓ కారణం ఉంటుంది.

ఈగోలు ఆడవారికంటే మగవారికే ఎక్కువగా ఉంటాయి.

ఈగోలు పెరిగే కొద్ది మనిషి ప్రమాదంలో పడ్డం కూడా ఎక్కువవుతుంది.

సూపర్‌ ఈగో విషయానికి వస్తే.. ఇది మనకు మన తల్లిదండ్రులు లేదా ఇతరులు నేర్పిన విషయాల మీద ఆధారపడి ఉంటుంది.

3-5 ఏళ్ల వయసు ఉన్నపుడు ఈ సూపర్‌ ఈగో మొదలవుతుంది.

సూపర్‌ ఈగోకు సంబంధించినంత వరకు మనిషి ఎక్కువగా సమాజం, కట్టుబాట్ల గురించి ఆలోచిస్తాడు.

సమాజం దృష్టిలో తప్పు అని తెలిసిన వాటిని చేయటానికి మనిషి భయపడతాడు.

మనిషి ఐడీని కంట్రోల్‌ చేయటమే సూపర్‌ ఈగో పని.