శరీరంలో వేడి ఎక్కువైన సందర్భంలో చల్లటి నీరు తాగటం వల్ల మంచి ఫలితం ఉంటుంది

మెంతులను వేయించి, పొడిచేసి గోరువెచ్చటి నీటితో కలిపి తాగడం ద్వారా కూడా వేడిని తగ్గించుకోవచ్చు.

రోజూ రెండు కప్పులు తాటి బెల్లం కలిపిన నీళ్లను తాగడం ద్వారా కూడా శరీరంలో వేడిని తగ్గించుకోవచ్చు.

ప్రతిరోజూ కొబ్బరి నీళ్లు తాగడం ద్వారా శరీరం చల్లబడుతుంది. 

దోసకాయ నేరుగా తినడం.. కర్ర చేసుకొని తినడం వల్ల వేడి తగ్గుతుంది

దోసకాయల్లో అధికంగా నీరు ఉండటం వల్ల శరీరాన్ని చల్లబరిచే గుణాన్ని కలిగి ఉంది. 

పచ్చి దోసకాయ ముక్కలను తీసుకున్నా లేకుంటే కూరగా తీసుకున్నా మంచిదే.

పుదీనా ఆకులతో తయారు చేసే జ్యూసు శరీరంలో వేడిని తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. 

గోరు వెచ్చని పాలల్లో తేనె కలుపుకుని రోజు తాగితే వేడి నుండి ఉపశమనం పొందవచ్చు. 

పుచ్చకాయ శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. ఇది శరీరంలో వేడి తగ్గించడానికి చాలా ప్రభావంతంగా పనిచేస్తుంది. 

కీర దోసకాయ  శరీరానికి చల్లదనాన్ని అందించడంలో అద్భుతంగా ప్రభావవంతంగా పనిచేస్తుంది .

పెద్ద జీలకర్రను రాత్రంతా నీటిలో నానబెట్టుకొని తెల్లారి తాగితే శరీరం చాలా వరకు చల్లబడుతుంది.

శరీరంలో వేడిని తగ్గించడానికి అరటి దూట బాగా ఉపయోగపడుతుంది.