ఆధ్యాత్మికంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా తులసి మొక్క చాలా మంచిది. 

ఇంట్లో తులసి మొక్క ఉంటే శుభం అని చెబుతారు.

అయితే ఈ తులసిని సరిగా ఉపయోగించుకోకపోతే దుష్ప్రయోజనాలు కూడా ఉంటాయి.

తులసిని ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకోండి.

తులసి మాలని మేడలో ధరిస్తే తేజస్సు పెరుగుతుంది. అనేక రకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది.

చనిపోయిన వారి నోటిలో తులసి ఆకుల నీరు పోస్తే పాపాల నుండి విముక్తి పొందుతారని, వైకుంఠం వెళ్లే మోక్షం లభిస్తుందని నమ్ముతారు.

అయితే తులసిని పాలలో కలిపి తీసుకోకూడదు. పాలలో తులసి ఆకులను కలిపితే ఆమ్ల ప్రభావం ఉంటుంది. అది హానికరమని శాస్త్రీయంగా రుజువైంది.

ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా సూర్యోదయం తర్వాత మాత్రమే తులసి ఆకులను కోయాలని బ్రహ్మవైవర్త పురాణంలో తెలుపబడింది.

పురాణాల ప్రకారం పౌర్ణమి, అమావాస్య, ద్వాదశి రోజులు, అలానే మధ్యాహ్నం, రాత్రి వేళల్లో తులసి ఆకులను శుభ్రం చేయకుండా కోయకూడదు.

శుభ్రం చేయకుండా కోస్తే పాపం తగులుతుందని అంటారు.

తులసి మొక్కను ఇంట్లో ఏ దిశలో అయినా నాటవచ్చు. కానీ ఆ ప్రదేశం పవిత్రమైనదిగా ఉండాలి. 

అయితే ఈశాన్య దిశలో మొక్కను నాటడం వల్ల మొక్క మసకబారదు. మంచి ఫలితాలు ఉంటాయి.  

ప్రతి రోజూ ఉదయం పరగడుపున 5 నుంచి 7 తులసి ఆకులను తింటే మంచిది. రాగి పాత్రలో నిల్వ చేసిన తులసి నీరు రాత్రి పూట తాగితే ఆరోగ్యానికి మంచిది.

అయితే తులసి ఆకులు కణాలు దంతాల మధ్య ఉండకుండా జాగ్రత్త వహించండి. ఎందుకంటే దీని వల్ల దంతాల మీద, కడుపు మీద ప్రభావం పడుతుంది.

రక్తపోటుని నియంత్రించడంలో తులసి నీరు మెరుగ్గా పని చేస్తుంది. జీర్ణవ్యవస్థ మెరుగ్గా పని చేస్తుంది.  

మలేరియా, జ్వరాలు వంటి సమస్యల నుంచి తులసి ఆకులు బయటపడేస్తాయి.

మానసిక వ్యాధులు కూడా నయమవుతాయని నిపుణులు చెబుతున్నారు. జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.

రాత్రిపూట తులసి విత్తనాన్ని నీటిలో నానబెట్టి.. ఆ నీటిని ఉదయం పరగడుపున తాగితే వీర్య రక్షణకు సహాయపడుతుంది.

గమనిక: ఇది కేవలం అంతర్జాలం నుండి సేకరించింది మాత్రమే. అవగాహన కోసం నిపుణులను సంప్రదించవలసిందిగా మనవి.