పార్వతీ, పరమేశ్వరుల పుత్రుడు వినాయకుడి జన్మదినాన్నే వినాయక చవితిగా జరుపుకుంటాం.
తొమ్మిది రోజులపాటు భక్తి శ్రద్ధలతో గణనాథుడిని పూజిస్తాం.
అయితే వినాయక చవితి రోజు చేసుకునే పూజలో కొన్ని వస్తువులు తప్పకుండా ఉండాలి.. అవేంటో చూద్దాం.
వినాయకుడి విగ్రహం తప్పకుండా బంకమట్టితో చేసిందే అయ్యుండాలి.
వినాయకుడికి చేసే పూజలో తప్పకుండా పాలవెల్లి కట్టుకుంటారు.
పూజ కోసం కలువ పూలు, బంతి పూలను ఉపయోగిస్తారు.
అలంకరణ కోసం చామంతి పూల మాలను ఉపయోగించాలి.
వినాయక చవితి రోజు స్వామివారిని 21 రకాల ఆకులతో పూజిస్తారు.
గణేశ్ పూజలో తప్పకుండా గరిక ఉండాలి. అది లేకుండా బంగారం, వజ్రాలు పెట్టినా స్వామివారిని ప్రసన్నం చేసుకోలేరు.
స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రమైన ఉండ్రాళ్లను నైవేద్యంగా సమర్పించాలి.
గణనాధుడికి నివేదించే పండ్లలో తప్పకుండా వెలక్కాయ ఉండేలా చూసుకోవాలి.
వినాయకుడి పూజలో తప్పకుండా గణపతి అష్టోత్తరం పారాయణం చేయాలి.
గణనాధుడికి చేసే పూజలో దీపారాదన కొబ్బరినూనెతో చేస్తే శ్రేష్టం, లేదా ఆవు నెయ్యితో అయినా చేయచ్చు.
ఇది కేవలం గణేశ్ పూజ మాత్రమే కాదు.. ప్రకృతిని పూజిచడం, ఆరాధించడం