ఈ పండగను చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకుంటారు.
ఈ దీపావళి పర్వదినాన లక్ష్మీ దేవిని పూజించడం వల్ల.. సిరి సంపదలు వస్తాయని నమ్ముతుంటారు
అయితే... ఈ పూజ సమయంలో చేయాల్సిన, చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. అవేంటో చూద్దాం..
దీపావళి పూజ సమయంలో, ఇల్లు లేదా వ్యాపార స్థలం ఈశాన్య దిశలో బలిపీఠాన్ని ఏర్పాటు చేయండి.
పూజలో ఉంచిన విగ్రహాలు తూర్పు దిక్కుకు ఎదురుగా ఉండాలి.
పూజ చేసే వారు తప్పనిసరిగా ఉత్తరం వైపు కూర్చుని ఉండాలి.
పూజలో ఉంచిన దీపాల సంఖ్య తప్పనిసరిగా 11, 21 లేదా 51 ఉండాలి.
ఇంటి ఆగ్నేయ మూలలో ఆవాలు లేదా నువ్వుల నూనె దీపాన్ని ఉంచి దాని నుంచే ఇంట్లోని మిగిలిన దీపాలను వెలిగించాలి.
దీపావళి పండుగ సమయంలో ఇల్లు, వ్యాపార ప్రాంగణాన్ని చక్కగా, శుభ్రం చూసి మంచి వెలుతురుతో ఉంచండి.
పూజ సమయంలో వివాదాలు, గొడవలు, విభేదాలకు దూరంగా ఉండండి.
పూజ సమయంలోఇతర విషయాలపై దృష్టి పెట్టకుండా అమ్మవారిపైనే ధ్యాస ఉంచాలి.
దీపావళి పండగ సమయంలో ఎప్పుడూ డబ్బు తీసుకోకండి లేదా డబ్బు ఇవ్వకండి.
సూర్యాస్తమయం తర్వాత ఇతరులకు వస్తువులను ఎప్పుడూ ఇవ్వకండి.
ప్రదోష సమయంలో లేదా సూర్యాస్తమయం తర్వాత వెంటనే రెండు గంటల సమయంలో దేనినీ ఇవ్వకండి.
పండుగ సమయంలో ఎవరికీ తోలు వస్తువులు, పదునైన అంచులు ఉన్న వస్తువులు బహుమతిగా ఇవ్వకండి.
ఒకే వేళ ఈ వస్తువులలో ఏదైనా ఇవ్వడం తప్పనిసరి అయితే, వాటిని స్వీట్లతో పాటు ఇవ్వండి.
దీపావళి వేడుక సమయంలో ఎప్పుడూ మాంసాహారం మందు ఆల్కహాల్ తీసుకోకుడదు.
పూజ చేసిన వెంటనే పూజ స్థలం లేదా ఇంటిని ఊడ్వడం, తుడవడం చేయకూడదు.
ఇలా చేయడం వల్ల.. పూజ చేసిన ఫలితం దక్కకుండా పోతుందట.