(Cast & Crew) (నటీనటులు) అరుళ్ శరవణన్, ఊర్వశి రౌతేలా, గీతిక, వివేక్, నాజర్, ప్రభు, విజయకుమార్, యోగిబాబు, తదితరులు (దర్శకత్వం) జేడీ- జెర్రీ (సంగీతం) హారిస్ జయరాజ్ (నిర్మాత ) అరుళ్ శరవణన్
'ది లెజెండ్ శరవణ స్టోర్స్' ద్వారా వ్యాపారవేత్తగా గుర్తింపు సాధించారు అరుళ్ శరవణన్
కమర్షియల్స్ యాడ్స్ లో నటించడంతో నటనపై ఆసక్తిని బయటపెట్టాడు
‘ది లెజెండ్’ సినిమాతో హీరోగా చేయాలనే కలను నెరవేర్చుకున్నారు
హీరో కావడానికి వయసుతో సంబంధం లేదంటున్న అరుళ్ శరవణన్
మరి 52 ఏళ్ళ శరవణన్ హీరోగా నటించిన '‘ది లెజెండ్’ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం!
కథ చూస్తే.. అరుళ్ శరవణన్ ఈ సినిమాలో డాక్టర్ శరవణన్ అనే సైంటిస్ట్
అయితే తన ఆప్తమిత్రుడు డయాబెటిస్ తో ప్రాణాలు కోల్పోతాడు
అప్పటినుండి ఆ షుగర్ వ్యాధికి మందు కనిపెట్టడమే లక్ష్యంగా పెట్టుకుంటాడు శరవణన్
ఈ క్రమంలో శరవణన్ కి విలన్స్ నుండి ఎలాంటి ఆటంకాలు ఏర్పడ్డాయి?
తన లక్ష్యాన్ని ఎలా సాధించాడు? అనేది తెరపై చూడాలి
దర్శకులు జేడీ- జెర్రీ మామూలు పాత కథను కొత్తగా చూపించే ప్రయత్నాలు చేశారు
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘శివాజీ- ది బాస్’ సినిమా గుర్తుకు వస్తుంది
నెక్ట్స్ ఏం జరగబోతోంది? అనే ఆసక్తి సినిమాలో మిస్ అయ్యింది
హీరోగా శరవణన్ కొన్నిసార్లు పర్వాలేదనిపించి.. కొన్నిసార్లు తేలిపోయాడు
కమర్షియల్ సినిమాకు కావాల్సిన పాటలు, డ్యా న్సులు, ఫైట్స్ ఉన్నాయి
హీరోయిన్, విలన్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుల వరకు అంతా పేరున్నవారే
నిర్మాణంలో ఎక్కడా లెజెండ్ శరవణన్ వెనక్కి తగ్గలేదు
హారిస్ జయరాజ్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది
వేల్‌రాజ్ కెమెరా వర్క్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తుంది
రూ.80 కోట్ల భారీ బడ్జెట్ తో 'ది లెజెండ్' మూవీ తెరకెక్కింది