పిల్లలకి 5, 6 సంవత్సరాలు వచ్చేసరికి పాల దంతాలు ఊడిపోతుంటాయి.
పాల దంతాలు ఊడిపోయే సమయంలో పిల్లలు వాటితో ఆడుతుంటారు.
ఒక్కోసారి పొరపాటున మింగేస్తుంటారు కూడా.
అయితే అలా మింగడం వల్ల ప్రమాదం ఏమీ లేదని నిపుణులు చెబుతున్నారు.
దంతంలో కాల్షియం ఉంటుందని, అది ఆమ్లంలో కరిగిపోతుందని అంటున్నారు.
ఒకవేళ దంతం కడుపులో కరగకపోతే.. మూత్రం ద్వారా బయటకు వచ్చేస్తుందని చెబుతున్నారు.
కడుపులోకి వెళ్లిన వస్తువులు ప్రేగుల నుండి బయటకు రావడానికి 7 నుంచి 10 రోజులు పడుతుందని చెబుతున్నారు.
పిల్లలు మింగిన ఏ వస్తువులైనా జీర్ణవ్యవస్థ గుండా హాని కలిగించకుండా వెళ్తాయని చెబుతున్నారు.
ఒక వస్తువు లేదా పదార్థం.. జీర్ణవ్యవస్థ, ఇరుకైన భాగం గుండా వెళ్తున్నపుడు.. అది అన్నవాహిక కడుపులో కలుస్తుందని అంటున్నారు.
అయితే పిల్లలు ఆహారం మింగే సమయంలో ఇబ్బంది పడితే మాత్రం ఖచ్చితంగా వైద్యులను సంప్రదించాలి.
మెడ నొప్పి, ఛాతి నొప్పి, వాంతులు రావడం, మలం నుంచి రక్తం రావడం, కడుపునొప్పి వంటివి ఉంటే వైద్యుడ్ని సంప్రదించాలి.
దంతం మింగిన వెంటనే జ్వరం వస్తే కనుక పిల్లల్ని వెంటనే వైద్యుడి దగ్గరకు తీసుకెళ్ళాలి. ఎండోస్కోపీ చేయించాలి.
ఇలా జరక్కుండా ఉండాలంటే జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది.
దంతాలు ఊడిపోతున్నట్టు అనిపించినా, వదులుగా ఉన్నా మీరే వాటిని బయటకు తీసేయాలి.
దంతాలను మిగకూడదని పిల్లలకు చెప్పాలి.
ఏదైనా తినేటప్పుడు లేదా కొరికేటప్పుడు జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. లేదంటే తినే వాటితో పాటు దంతం కూడా కడుపులోకి వెళ్లిపోయే అవకాశం ఉంటుంది.