చాలా మంది డస్ట్ ఎలర్జీతో బాధపడుతూ ఉంటారు. కాలుష్యం ఎక్కువ అవ్వడంతో డస్ట్ ఎలర్జీ అనేది అందరిని తెగ ఇబ్బంది పెడుతోంది.
మీరు కూడా డస్ట్ ఎలర్జీ తో బాధ పడుతున్నట్లయితే ఈ చిట్కాలని అనుసరించండి.
టక్కున ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.
వ్యాధి నిరోధక శక్తి బలహీనంగా ఉండడం వలన డస్ట్ ఎలర్జీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
కాబట్టి ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా మీ ఒంట్లో పెరిగేలా చూసుకోండి.
అందుకోసం డైట్ లో పెరుగు కచ్చితంగా ఉండేలా చూసుకోండి.
డస్ట్ ఎలర్జీతో పాటు చాలా ఎలర్జీలు తగ్గించడంలో తేనె చాలా ఉపయోగపడుతుంది.
తుమ్ములు, దగ్గు వంటి వాటి నుండి కూడా ఉపశమనం ఇస్తుంది.
డస్ట్ ఎలర్జీ సమస్యతో బాధపడే వాళ్లు నెయ్యి బెల్లం పొడి కలిపి తీసుకుంటే ఆ సమస్య నుంచి బయట పడొచ్చు.
డస్ట్ ఎలర్జీ సమస్య ఉంటే రోజూ పది నిమిషాలు పాటు ఆవిరి పడితే ఈ సమస్య నుండి మీకు రిలీఫ్ కలుగుతుంది.
ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవడం వలన కూడా డస్ట్ ఎలర్జీ సమస్య నుండి బయటపడవచ్చు.
సిట్రస్ ఫ్రూట్స్, అలోవెరా జ్యూస్ కూడా డస్ట్ ఎలర్జీ సమస్య నుంచి బయటపడటానికి ఉపయోగపడతాయి.
నోట్: పైన టిప్స్ పాటించేముందు మీ దగ్గర్లోని డాక్టర్, నిపుణల సలహా తీసుకోండి.