పూర్వీకులు మనకి కొన్ని అలవాట్లను నేర్పుతారు. వాటిలో ఒకటి మజ్జిగన్నంలో పచ్చి మిరపకాయ నంజుకు తినడం.

మజ్జిగన్నంలో లేదా పెరుగన్నంలో పచ్చి మిరపకాయ నంజుకుని తింటే ఉంటాది.

ఆ రుచే వేరు. కొంతమంది ఉల్లిపాయ నంజుకుంటారు. అయితే పచ్చిమిర్చి వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి.

పచ్చి మిర్చి ప్రతీ కూరలోనూ వేస్తుంటారు. అయితే కారంగా ఉంటుందని కొంతమంది తినడం మానేస్తారు.

అయితే ఈ పచ్చి మిరపకాయను తింటే బరువు తగ్గడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.  

కొవ్వుని కరిగించి, ఊబకాయాన్ని నివారించే లక్షణం ఈ పచ్చి మిరపకాయకి ఉంది. 

శరీరంలో పేరుకుపోయిన అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.

పచ్చిమిర్చికి యాంటీ క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయి. ఇవి క్యాప్సైసిన్ కీమో ప్రివెంటిక్ లక్షణాలను కలిగి ఉంటాయి.

ఇవి రొమ్ము క్యాన్సర్, కొలెరెక్టల్ క్యాన్సర్, ప్రోస్తటిక్ క్యాన్సర్, లంగ్స్ క్యాన్సర్, గ్యాస్ట్రిక్ క్యాన్సర్ వంటి ఎన్నో రకాల క్యాన్సర్ కణాలను నిర్మూలించే గుణాలు ఈ పచ్చిమిర్చిలో ఉన్నాయి. 

గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా పచ్చిమిర్చి బాగా పని చేస్తుందని అంటారు. 

మిరపకాయలు తినడం వల్ల గుండె సంబంధిత సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.  

కార్డియోవాస్కులర్, టైప్ 2 డయాబెటీస్ నివారణకు ఈ పచ్చి మిరపకాయలు మెడిసన్ లా పని చేస్తాయి.

చర్మాన్ని మెరిసేలా చేసి.. వృద్ధాప్యాన్ని నివారించే శక్తి పచ్చిమిర్చికి ఉంది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు అకాల వృద్ధాప్యాన్ని నివారిస్తాయి.

పచ్చిమిర్చిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ అలర్జీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి.

పచ్చిమిర్చిలో ఉండే క్యాప్సైసిన్ యాంటీ మైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంటుంది. 

ఆహారంలో రోగాలను కలిగించే సూక్ష్మజీవుల నుంచి మనల్ని రక్షిస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.

డైలీ కూరల్లో వేసిన పచ్చి మిరపకాయలను తింటే మూత్రనాళం నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.