నేటి ఆధునిక సమాజంలో కాలంతో సంబంధం లేకుండా జనాలు ACల కింద బతుకుతున్నారు.

దాంతో కొద్దిగా ఎండ  తగిలినాగానీ శరీరాలు తట్టుకోలేక పోతున్నాయి.

ఎండ వేడి తట్టుకోలేక అల్లాడిపోతుంటారు.

ఆఫీసుల్లో ఏసీ అలవాటుకు ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు ఇంట్లో సైతం ఏసీలను ఏర్పాటు చేసుకుంటున్నారు.

అయితే ఇలా గంటలు గంటలు ఏసీల కింద గడిపితే అనారోగ్య సమస్యలు వస్తాయి అంటున్నారు వైద్య నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

కళ్లు పొడిబారే సమస్య ఉన్నవారు ఎక్కువగా ఏసీల్లో ఉండరాదు.

ఇలా ఉంటే ఆ సమస్య ఇంకా పెరుగుతుంది అంటున్నారు నిపుణులు.

ఏసీ గదుల్లో ఎక్కువ సమయం గడిపితే చర్మం పొడిబారి పోతుంది. స్కిన్ లో ఉండే తేమ పోయి చర్మం పొడిగా తయ్యారు అవుతుంది.

చాలా మంది చల్లటి వాతావరణంలోనే ఉన్నాం కదా.. బాడీ డీ హైడ్రేట్ కాదు అనుకుంటారు. 

కానీ ఏసీ ఉన్న ప్రాంతంలో గాలిలోని తేమ త్వరగా తగ్గుతుంది. దాంతో మన శరీరం డీ హైడ్రేషన్ గురవుతుంది.

ఏసీల్లో ఎక్కువగా ఉంటే శ్వాసకోశ సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ముక్కు, గొంతు, ఉపిరితిత్తులు ఇన్ ఫెక్షన్లు వస్తాయి అంటున్నారు వైద్యులు.

తరచూ చల్లని గదిలో ఉంటే ఆస్తమా, ఎలర్జీ లాంటి సమస్యలు చుట్టుముడతాయి అంటున్నారు నిపుణులు.

అదీకాక ఏసీ గదుల్లో గంటల కొద్ది ఉంటే  ముక్కులో పొడిదనం ఏర్పడుతుంది. దీని కారణంగా వైరల్ ఇన్ ఫెక్షన్లు వస్తాయంటున్నారు వైద్య నిపుణులు.