ఈ రోజుల్లో చాలా మంది టాయిలెట్ లోకి వెళ్లి అందులోనే గంటలు గంటలు గడిపేస్తున్నారు.
మొబైల్ తో బాత్ రూంలోనే వెళ్తూ అందులో కాలక్షేపం చేస్తూ ఉంటారు.
అలాంటి వారికి దిమ్మతిరిగే న్యూస్ చెబుతున్నారు వైద్య నిపుణులు.
బాత్ రూంలో 10 నిమిషాల కంటే ఎక్కువ సమయం గడపడం అనేది చాలా డేంజర్ అంటున్నారు.
టాయిలెట్‌లో ఎక్కువ సమయం గడిపితే వచ్చే అనారోగ్య సమస్యలు ఏంటి?
అసలు నిపుణులు ఏం చెబుతున్నారో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
చాలా మంది బాత్రూంలో ఫోన్ చేత పట్టుకుని వీడియోలు చూస్తూ చాలా సేపు టైమ్ చేస్తుంటారు.
ఇదే కాకుండా న్యూస్ పేపర్ చదవడం, సాంగ్స్ వినడం వంటివి కూడా చేస్తుంటారు.
బాత్రూంలో ఇలా చేయడం చాలా డేంజర్ అంటున్నారు నిపుణులు.
బాత్రూంలో ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల మలదారంలోని సిరలపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుంది.
తద్వారా, చికాకు తెప్పించడంతో పాటు వాపు కూడా వచ్చే అవకాశం లేకపోలేదు.
ఇది రాను రాను హోమోరాయిడ్స్ గా మారి చివరికి ఫైల్స్ వచ్చే ప్రమాదం ఉందంటున్నారు వైద్యులు.
బాత్రూంలో చాలా సేపు అలాగే కూర్చుంటే మాత్రం మూత్ర నాళంలో బాక్టిరియా చేరి లేని పోని ఇన్ఫెక్షన్స్ సోకే ప్రమాదం ఉందంటున్నారు.
ఇక నుంచైనా బాత్రూంలో 10 నిమిషాలకు మించి ఎక్కువ సమయం గడపకూడదని సూచిస్తున్నారు నిపుణులు.
ఇదే కాకుండా రోజూ మంచి నీళ్లు బాగా తాగాలని కూడా సూచిస్తున్నారు.