న్యూ ఢిల్లీలో ఉన్న అక్షర్ ధామ్ ఆలయం కూడా అలాంటి అద్భుత ఆలయాల్లో ఒకటి.
యమునా నదీ తీరంలో అత్యంత వేగంగా నిర్మాణం జరుపుకున్న ఆలయం ఇదే.
141 అడుగుల ఎత్తుతో నిర్మించిన అక్షర్ ధామ్ ఆలయం పురాతన నిర్మాణశైలికి ప్రతీక.
అక్షర్ ధామ్ ఆలయ నిర్మాణానికి 3 వేల టన్నుల రాతిని ఉపయోగించారు.
ఈ ఆలయంలో 145 కిటికీలు, 154 శిఖరాలు ఉన్నాయి.
ఈ ఆలయం ప్రాంగంణంలో 200 మంది ఆచార్యులు, రుషుల రాతి శిల్పాలు ఉన్నాయి.
అక్షర్ ధామ్ ఆలయం ప్రాంగణంలో కమలం ఆకారంలో ఉండే గార్డెన్ ఆకట్టుకుంటుంది.
ఈ ఆలయంలో ఉన్న యజ్ఞ కుండ్.. ప్రపంచంలోనే అతిపెద్దది.
ఈ ఆలయం వద్ద నదిలో ‘సాంస్కృతిక విహారం’ బోట్ రైడ్ ప్రత్యేకంగా ఉంటుంది.