ప్రపంచ ఏడు వింతల్లో ఒకటి తాజ్ మహాల్. ఇది ప్రేమకు చిహ్నంగా భావిస్తుంటారు భారతీయులు.
దేశంలో మొఘల్ భవన నిర్మాణ శాస్త్రానికి ఒక గొప్ప తార్కాణం. చక్రవర్తి షాజహాన్ తన ప్రియమైన భార్య ముంతాజ్ జ్ఞాపకార్ధంగా దీన్ని నిర్మించాడు.
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఉన్న ఈ పాలరాతి కట్టడం సమాధి అనేది అందరికీ తెలిసిందే.
పర్షియా, భారతీయ, ఇస్లాం భవన నిర్మాణ అంశాల శైలితో నిర్మించబడింది. దీన్ని చూడటానికి ఈ దేశం నుండే కాకుండా విదేశీయలు కూడా వచ్చి సందర్శిస్తుంటారు. ఈ కట్టడాన్ని చూసి నివ్వెరపోతుంటారు.
ఇలాంటిదే ఔరంగాబాద్‌లో కూడా దీనిని పోలిన కట్టడం ఉంది. అయితే ఇప్పుడొక కుమారుడు తన తల్లి కోసం తాజ్ మహాల్ నిర్మించి.. తన తల్లిపై ఉన్న ప్రేమను చాటుకున్నాడు.
వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని తిరువారూర్ జిల్లాకు చెందిన అమృతిన్ షేక్ దావూద్ అనే వ్యాపార వేత్తకు తల్లి జైలానీ బీవీ అంటే అమితమైన ప్రేమ, గౌరవం.
అయితే తల్లి 2020లో మరణించారు. తండ్రి.. అతడి 11 ఏళ్ల వయస్సులో చనిపోవడంతో.. తనను, తన నలుగురు సోదరీమణులను బాధ్యతను నెత్తికేసుకుని, వారిని ప్రయోజకులను చేసిందట.
అటుంవంటి తల్లి చనిపోగా.. ఆమెకు ఏం చేసినా తక్కువే అని భావించిన కుమారుడు తాజ్ మహాల్ కట్టాలని నిర్ణయించాడు.
వందలాది కార్మికులను నియమించి, ఒక ఆర్కిటెక్ట్‌ను నియమించి రెండేళ్లలో ఈ మహాల్ పూర్తి చేయించాడు కుమారుడు
రాజస్థాన్‌లోని తెల్లని పాలరాయితో తాజ్ మహల్ లాంటి భవనాన్ని నిర్మించారు. ఆమె సంవత్సరీకం నాడు వేలాది మందికి భోజనాలు పెట్టించేవాడట.
అయితే ఇంకేదో అమ్మకు చేయాలన్న ఉద్దేశంతో ఈ తాజ్ మహాల్ పోలిన భవంతిని కట్టించాడు.
జూన్ 2న స్మారక చిహ్నాన్ని ప్రజల సందర్శనార్థం ప్రారంభించాడు.
ఇది అన్ని మతాల ప్రజలు ధ్యానం చేయగల ధ్యాన కేంద్రాలు, ప్రస్తుతం 10 మంది విద్యార్థులు ఉంటున్న మదర్సాను ఏర్పాటు చేశారు.