కాటుక అనేది మన జీవన విధానంలో ఒక భాగం. పుట్టిన పిల్లలకి దిష్టి తగలకుండా బుగ్గ, నుదిటి మీద కాటుక పెడతారు.
ఈ కాటుక పెట్టుకోవడం వల్ల అందమే కాదు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
సూర్య కిరణాలు నేరుగా పడితే ప్రమాదకరం. కాబట్టి కాటుక పెట్టుకుంటే కిరణాలు పడినా ఇబ్బంది ఉండదు.
కాటుక పెట్టుకోవడం వల్ల కళ్ళకి చలువ చేస్తుంది. కళ్ళను తాజాగా ఉంచడమే కాకుండా మెరిసేలా చేస్తుంది.
కాటుక రాసుకోవడం వల్ల కళ్ళు శుభ్రంగా, కూల్ గా ఉంటాయి. కాటుక కంటి చూపుని మెరుగుపరుస్తుంది మరియు బలపరుస్తుంది.