కలబందకు మార్కెట్ లో ప్రస్తుతం చాలా గిరాకీ ఉంది. దీనిని ఎన్నో రకాల మందుల తయారీలో ఉపయోగిస్తున్నారు.
కలబందను మందుల తయారీలోనే కాకుండా, ఆరోగ్యానికి చాలా మంచిది అంటూ దీనిని ఎన్నో రకాలుగా వాడుతుంటారు.
ఈ కలబంద గుజ్జుతో ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి? అసలు నిపుణులు ఏం చెబుతున్నారో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
కలబందకు ప్రస్తుతం బయట మార్కెట్ లో చాలా డిమాండ్ ఉంది.
దీనిని ఎంతో మంది రైతులు ప్రత్యేకంగా పెంచుతున్నారు.
మలబద్దం సమస్య ఉన్నవారు ప్రతీ రోజు రాత్రి పూట కొద్దిగా తినాలి.
ఇలా చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు.
పాదాలు పగుళ్లు బారిన పడిన వ్యక్తులు ఆ పగుళ్లపై ఈ కలబంద గుజ్జును రాస్తే త్వరగా ఉపశమనం కలుగుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.
డయాబెటీస్ పేషెంట్స్ సైతం ఈ కలబంద గుజ్జును తీసుకుంటే షుగర్ లెవల్స్ ను అదుపులో ఉంచుకోవచ్చట.
తగిలిన గాయాలు, మానని గాయల, పుండ్లపై కూడా ఈ కలబంద గుజ్జు రాస్తే త్వరగా నయమవుతాయట.
ఎన్నో ఔషద గుణాలు కలిగిన ఈ కలబంద గుజ్జును ఉదయం పూట తీసుకుంటే రోగ నిరోదక శక్తి పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
ముఖంపై మచ్చలు, మొటిమలు ఉన్నవారు సైతం ముఖంపై రాస్తే మంచి ఫలితాలు ఉంటాయని తెలుస్తోంది.