ప్రస్తుత సమాజంలో శృంగార జీవితానికి సంబంధించి చాలా మందిలో చాలా రకాల అపోహలు ఉన్నాయి.

ముఖ్యంగా పెళ్లైన కొత్తలో శృంగార విషయాల్లో అమ్మాయిలకు, అబ్బాయిలకు అపోహలు, అనుమానాలు ఉంటాయి.

అయితే ఇలాంటి ఆలోచన విధానం, అమ్మాయిల పట్ల కొంత మంది అబ్బాయిలు బిహేవ్ చేసే విధానంపై సంచలన వ్యాఖ్యలు చేసింది స్టార్ సింగర్ చిన్మయి.

సెక్స్ లో పాల్గొంటుంటే.. టైట్ గా ఉంటేనో.. రక్తం వస్తేనో వర్జిన్ అనుకుంటారు మీరంతా అంటూ బోల్డ్ కామెంట్స్ చేసింది.

ఓ ట్రోల్ వీడియోను షేర్ చేసి వర్జినిటీ గురించి చెప్పుకొచ్చింది సింగర్ చిన్మయి.

అమ్మాయిల విషయంలో అబ్బాయిలకు ఉన్నవన్ని అపోహలే. అబ్బాయిలు తొలి కలయికలో అమ్మాయిలకు నొప్పి ఉంటుంది అనుకుంటారు.

అయితే అది అందరిలో ఉండదు. పైగా తొలి సారి సెక్స్ లో పాల్గొన్నప్పుడు టైట్ గా ఉంటేనో.. లేదా రక్తం వస్తేనే వర్జిన్ అనుకోవద్దు. దాంట్లో నిజం లేదు.

వర్జినిటీ విషయంలో అబ్బాయిల ఆలోచనలు మార్చాలనే తాను ఇలా బోల్డ్ గా ఈ వీడియోను బేస్ చేసుకుని మాట్లాడాను అని చెప్పుకొచ్చింది చిన్మయి.

ఇక ఫస్ట్ టైమ్ శృంగారంలో పాల్గొన్నప్పుడు నొప్పిగా ఉంటే.. డాక్టర్ ను సంప్రదించాలని ఆమె సూచించారు.

ఇలాంటి విషయాలపై వచ్చే ట్రోల్స్ ను, విమర్శలను పట్టించుకోవద్దని ఆమె యువతకు సూచించారు.