సమంత ప్రస్తుతం ‘సిటడెల్‌ ఇండియా’ అనే వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సిరీస్‌లో సమంతతో పాటు బాలీవుడ్‌ హీరో వరుణ్‌ ధావన్‌ నటిస్తున్నారు.

ఈ సిరీస్‌కు రాజ్‌ అండ్‌ డీకేలు దర్శకత్వం వహిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సిరీస్‌ కోసం సమంత తీసుకున్న రెమ్యూనరేషన్‌కు సంబంధించి మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

సిటడెల్‌ కోసం సమంత ఏకంగా పది కోట్ల రూపాయలు తీసుకుందట.

అయితే, ఈ వార్తల్లో నిజం ఎంతుందో తెలీదు.

ఇదే గనుక నిజం అయితే, సమంత స్థాయి ముందు స్టార్‌ హీరోలు కూడా పనికి రారు అని చెప్పాలి.

ఓటీటీలో ఇంత భారీ మొత్తం తీసుకోవటం సమంతకే సాధ్యం అయిందని చెప్పటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.