రానున్న రోజుల్లో ఏపీ ముఖ చిత్రం మారబోతుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ముఖచిత్రం మారనుంది.
భోగాపురం ఎయిర్ పోర్ట్ ఉత్తరాంధ్రకు కేంద్ర బిందువుగా మారనుంది.
హైదరాబాద్ లో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ తరహాలోనే అత్యున్నత ప్రమాణాలతో భోగాపురం ఎయిర్ పోర్ట్ ని కూడా జీఎంఆర్ సంస్థ నిర్మించనుంది.
ఈ ప్రాజెక్ట్ పూర్తైతే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.
ఈ ప్రాజెక్ట్ తో విజయనగరం మరియు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ ఏడాదిలో రియల్ ఎస్టేట్ వేగంగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఈ ఏడాది రియల్ ఎస్టేట్ రంగంలో ఈ ఏరియాలో కనీసం 25 శాతం పెరుగుదల ఉంటుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా-ఏపీ ఛాప్టర్ స్టేట్ జనరల్ సెక్రటరీ కె. సుభాష్ చంద్రబోస్ వెల్లడించారు.
కాబట్టి విజయనగరం జిల్లాలో ఇప్పుడు స్థలం కొన్నవారికి తక్కువ సమయంలో భారీ లాభాలు పొందే ఛాన్స్ ఉంటుంది.
ఈ ఏరియాలో స్థలం చదరపు అడుగు రూ. 1000 నుంచి రూ. 2 వేల మధ్యలో పలుకుతోంది.
భోగాపురంలో అయితే చదరపు అడుగు రూ. 1,550 పలుకుతోంది. అంటే గజం రూ. 13,950 ఉంది.
150 గజాల స్థలం కొనాలంటే రూ. 20,92,500 అవుతుంది.
నిపుణులు చెప్పిన దాని ప్రకారం కనీసం 25 శాతం పెరిగినా రూ. 20 లక్షల పెట్టుబడి కాస్తా రూ. 25,50,000 అవుతుంది. ఏడాదిలో కనీసం రూ. 5 లక్షలు లాభం ఉంటుంది.
ఎయిర్ పోర్ట్ లాంఛ్ అయితే కనుక భూముల ధరలు పెరిగిపోతాయి. అప్పుడు కొనాలన్నా కొనలేని పరిస్థితి వస్తుంది.
కాబట్టి విజయనగరంలో ముఖ్యంగా భోగాపురం చుట్టుపక్కల గ్రామాల్లో పెట్టుబడి పెడితే హైదరాబాద్ లో పెట్టినట్టే అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
గమనిక: ఈ కథనం అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. పైన చెప్పిన వాటిలో మార్పులు ఉండచ్చు.
అలానే ప్రాపర్టీ కొనే ముందు నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవాల్సిందిగా మనవి