ఉపాసన కొణిదెల జూన్ 20న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. 

తమ ఇంట్లో మహాలక్ష్మీ అడుగు పెట్టబోతుందని తెలియగానే మెగా కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేవు.

పాప పుట్టిన 21వ రోజున తనకు పేరు పెడతామని, దాని కోసం ఉపాసన, తాను కొన్ని పేర్లు అనుకున్నామని చరణ్ చెప్పాడు. కాగా శుక్రవారం (జూన్ 30)న పాప బారసాల ఫంక్షన్ చేస్తున్నారు. 

ఈ కార్యక్రమానికి మెగా - అల్లు కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు సినీ రంగానికి చెందిన పలువురు సన్నిహితులు హాజరు కాబోతున్నారు. 

ఇదిలా ఉంటే చెర్రీ - ఉపాసన దంపతుల గారాల పట్టీకి అంబానీ దంపతులు అదిరిపోయే గిఫ్ట్ పంపారనే వార్త ఒకటి తెగ చక్కర్లు కొడుతోంది. 

 అది పంపింది ఎవరంటే, దేశంలోనే అతిపెద్ద వ్యాపార వేత్త ముఖేష్ అంబానీ. ఇంతకీ మెగా ఫ్యామిలీ అంతా షాక్ అవడంతో పాటుగా వారిని సర్‌ప్రైజ్‌కి గురి చేసిన ఆ గిఫ్ట్ ఏంటో తెలుసా.. ఊయల..

మామూలు ఊయల పంపితే ఆయన ముఖేష్ అంబానీ ఎందుకవుతారు. అందుకే చరణ్ పాప కోసం బంగారు ఊయలను బహుమతిగా ఇచ్చారు.

ముఖేష్ అంబానీ - నీతా అంబానీ దంపతులు పంపిన విలువైన బహుమతి చూసి చరణ్ - ఉపాసన ఆశ్చర్యపోయారట.

ఇక ఈ ఊయల తయారీకి రెండు కిలోలకు పైగా బంగారం వాడారాని, దీని కోసం అంబానీ రూ.1.20 కోట్ల వరకు ఖర్చు చేశారని సమాచారం. 

చరణ్ - ఉపాసన తమకు పెళ్లైన 11 సంవత్సరాల తర్వాత పాపకు జన్మనిచ్చారు. దీంతో మెగా ఫ్యామిలీ, ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. 

అల్లు - మెగా కుటుంబ సభ్యులంతా అపోలో ఆసుపత్రికి వెళ్లి పాపను చూశారు. మరోసారి తాతగా ప్రమోషన్ పొందిన చిరంజీవి సంతోషం ఆయన ముఖంలో స్పష్టంగా కనిపించింది. 

అలాగే ఉపాసన డెలివరీ టైం దగ్గర పడగానే చరణ్.. షూటింగ్స్, ఇతర కార్యక్రమాలన్నిటికీ బ్రేక్ ఇచ్చారు. భార్య, బిడ్డలను దగ్గరుండి చూసుకుంటూ ఫ్యామిలీతోనే గడుపుతున్నారు. 

ఆర్ఆర్ఆర్’ మూవీతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న మెగా పవర్ స్టార్ ప్రస్తుతం సిల్వర్ స్క్రీన్ సెల్యులాయిడ్ శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

చెర్రీ ఇందులో తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. కియారా అద్వాణీ కథానాయిక. ఇతర పాత్రల్లో ప్రముఖ నటీనటులు కనిపించనున్నారు.

థమన్ సంగీతమందిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని దిల్ రాజు భారీ బడ్జెట్‌‌తో తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.