చుండ్రు కారణంగా వెంట్రుకలు రాలిపోతుంటాయి. ఇలా అన్ని రకాలుగా చలికాలం అందరినీ ఇబ్బంది పెడుతుంది.
చలికాలం మన శరీరానికి రాసుకునే వాటిలో పెట్రోలియం ఉత్పత్తులు ఉండకుండా చూసుకోవాలి. సహజ పోషక పదార్థాలతో తయారు చేసిన క్రీమ్లను వాడాలి.
చలికాలంలో వారానికి కనీసం రెండుసార్లు స్క్రబ్తో చర్మాన్ని రుద్దాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై ఉన్న మృత కణాలు తొలిగిపోయి కొత్తవి పుడతాయి.
చలికాలంలో దాహం తక్కువగా వేస్తుంది. అంటే దానర్థం మన శరీరానికి నీటి అవసరం లేదని కాదు.