ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగా వైరలయిన దంపతులు తమిళ నిర్మాత రవీందర్, ఆయన భార్య మహాలక్ష్మి.
దాదాపు నెల రోజుల పాటు సోషల్ మీడియాలో వీరి పెళ్లి, దానిపై ట్రోలింగ్.. ఇదే నడిచింది. అందుకు కారణం రవిందర్.. అధిక బరువు.
ఇక వీరి పెళ్లి ఫోటోలు చూసిన వారు.. కేవలం డబ్బు కోసమే మహాలక్ష్మి.. రవీందర్‌ని వివాహం చేసుకుందని ట్రోల్ చేశారు.
పైగా ఈ దంపతులిద్దరికి ఇది రెండో వివాహమే. మహాలక్ష్మికి కుమారుడు కూడా ఉన్నాడు.
అయితే తమ మీద ఎంత ట్రోలింగ్ జరిగినా సరే.. ఈ జంట మాత్రం వాటిని పట్టించుకోకుండా.. నూతన దాంతప్య జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.
తాజాగా భార్య మహాలక్ష్మికి ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చాడు రవీందర్.
బ్రిటిష్ ఆటోమొబైల్ కంపెనీ మోరీస్ గ్యారేజీ కారుని కొనుగోలు భార్యకు గిఫ్ట్‌గా ఇచ్చాడు.
బ్రిటిష్ ఆటోమొబైల్ కంపెనీ మోరీస్ గ్యారేజీ కారుని కొనుగోలు భార్యకు గిఫ్ట్‌గా ఇచ్చాడు.
దీని ధర సుమారు 32 లక్షల రూపాయల వరకు ఉండవచ్చని తెలుస్తోంది.
ఇందుకు సంబంధించిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
దీపావళి పండుగను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది ఈ జంట.
అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అవి తెగ వైరలయ్యాయి.
మహాలక్ష్మి.. రవీందర్‌ని ఉద్దేశించి మై మ్యాన్.. లవ్ యూ అని చేసిన పోస్ట్ అయితే విపరీతంగా వైరలయ్యింది.