పాటియాలా లోకోమోటివ్ వర్క్స్, పాటియాలా 295 అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీ కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
పాటియాలా అప్రెంటిస్ రిక్రూట్మెంట్ కింద ఎలక్ట్రీషియన్, మెకానిక్, ఫిట్టర్, వెల్డర్ వంటి పలు విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనుంది.
అర్హతలు: ఎలక్ట్రీషియన్ పోస్టుకి: 10వ తరగతి మరియు ఇంటర్ లో సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్ట్స్ ఉండి కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఎలక్ట్రికల్ ట్రేడ్ లో ఐటిఐ సర్టిఫికెట్ ఉండాలి.
మెకానిక్ (డీజిల్) పోస్టుకి: 10వ తరగతి, ఇంటర్ లో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. మెకానిక్ (డీజిల్) ట్రేడ్ లో ఐటిఐ సర్టిఫికెట్ ఉండాలి.
మెషినిస్ట్: 10వ తరగతి మరియు ఇంటర్ లో సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్ట్స్ ఉండి కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. మెషినిస్ట్ ట్రేడ్ లో ఐటిఐ సర్టిఫికెట్ ఉండాలి.
ఫిట్టర్: 10వ తరగతి మరియు ఇంటర్ లో సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్ట్స్ ఉండి కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఫిట్టర్ ట్రేడ్ ఐటిఐ సర్టిఫికెట్ ఉండాలి.
వెల్డర్ (జి & ఈ): 8వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వెల్డర్(జి & ఈ) ట్రేడ్ లో ఐటిఐ సర్టిఫికెట్ ఉండాలి.
వయసు పరిమితి: వెల్డర్ పోస్టుకి అక్టోబర్ 31 2022 నాటికి 15 నుంచి 22 ఏళ్లు ఉండాలి ఇతర పోస్టులకి అక్టోబర్ 31 2022 నాటికి 15 నుంచి 24 ఏళ్లు ఉండాలి
అకడమిక్ మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోండి.
దరఖాస్తు చివరి తేదీ: 16/11/2022