ప్రస్తుతం లీటర్ పెట్రోల్ హైదరాబాద్ లో దాదాపు రూ. 110 పలుకుతోంది.
ఏపీలో ఐతే రూ. 110 నుంచి రూ. 113 మధ్య పలుకుతోంది.
పెరుగుతున్న పెట్రోల్ రేటుని భరించలేక సామాన్యులు గగ్గోలు పెడుతున్నారు.
అసలు ఈ పెట్రోల్ ధర తగ్గుతుందా? అంటే తగ్గుతుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అంటున్నారు.
లీటర్ పెట్రోల్ 15 రూపాయలకు పడిపోతుందని అంటున్నారు.
రాజస్థాన్ లోని ప్రతాప్ గఢ్ లో ఓ బహిరంగ సభకు హాజరైన నితిన్ గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేశారు.
పూర్తిగా ఇథనాల్ తో నడిచేలా విద్యుత్ వాహనాలకు ప్రాధాన్యం కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
రైతులతో ఇథనాల్ ని ఉత్పత్తి చేయిస్తే పెట్రోల్ వినియోగం తగ్గి దిగుమతులు తగ్గుతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇథనాల్, విద్యుత్ లభ్యతను బట్టి భవిష్యతులో 15 రూపాయలకే పెట్రోల్ లభిస్తుందని నితిన్ గడ్కరీ అన్నారు.
ఇది రైతుల వల్లే సాధ్యమవుతుందని.. రైతు కేవలం అన్నదాత మాత్రమే కాకుండా వాహనాలు నడిచే శక్తిని ఉత్పత్తి చేసే శక్తివంతమైన రైతు అవుతారని అన్నారు.
రైతులు తయారు చేసే ఇథనాల్ తో అన్ని వాహనాలూ నడుస్తాయని వ్యాఖ్యానించారు.
సగటున రైతులు ఉత్పత్తి చేసే 60 శాతం ఇథనాల్ తో మరియు 40 శాతం విద్యుత్ తో వాహనాలు నడుస్తాయని అన్నారు.
అదే జరిగితే అప్పుడు లీటర్ పెట్రోల్ 15 రూపాయలకే లభిస్తుందని అన్నారు.
తద్వారా పెట్రోల్ దిగుమతులు, కాలుష్యం తగ్గుతాయని.. రైతులకు ఎంతో మేలు చేకూరుతుందని అన్నారు.
ఏటా పెట్రోల్ దిగుమతుల ఖర్చు 16 లక్షల కోట్లు అవుతుందని.. పెట్రోల్ ధర తగ్గితే ఆ డబ్బు రైతుల జేబుల్లోకి వెళ్తాయని నితిన్ గడ్కరీ అన్నారు.