బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ సరైన హిట్ కొట్టి దాదాపు పదేళ్లు అవుతోంది. చెన్నై ఎక్స్‌ప్రెస్ తర్వాత ఆ స్థాయి హిట్ పడలేదు.
తాజాగా ‘పఠాన్’ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా రూపొందింది.
ఈ సినిమాలో షారుఖ్ సరసన దీపికా పదుకొనే హీరోయిన్ కాగా, జాన్ అబ్రహం విలన్ గా నటించారు.
డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ రూపొందించిన పఠాన్ మూవీ.. ఇప్పటికే సాంగ్స్, ట్రైలర్ లతో అంచనాలు భారీగా సెట్ చేసింది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం!
కథ: ఈ సినిమా కథాంశంలో దేశభక్తి కూడా ఉంటుంది. ఏజెంట్ జిమ్(జాన్ అబ్రహం), ఇండియాపై ప్రతీకారం తీర్చుకునే అవకాశం కోసం ఎదురు చూస్తుంటాడు. అదే సమయంలో భారత ప్రభుత్వం ఓ కీలక ఆర్టికల్ ని రద్దు చేస్తుంది.
దీంతో తనకు దారి క్లియర్ అయ్యిందని.. కాశ్మీర్ ని స్వాధీనం చేసుకోవడం కోసం పాకిస్తాన్ కి చెందిన సినిస్టర్ డిజైనర్స్ కలిసి అటాక్ కి ప్లాన్ చేస్తాడు.
కట్ చేస్తే.. జిమ్ అటాక్ గురించి తెలిసి ఇండియన్ గవర్నమెంట్.. అజ్ఞాతంలో ఉన్న స్పై సోల్జర్ పఠాన్(షారుఖ్)ని రంగంలోకి దించుతుంది.
జిమ్ ని అడ్డుకునేందుకు పఠాన్ కి తోడుగా ఐఎస్ఐ ఏజెంట్ రుబీనా(దీపికా) ఎంటర్ అవుతుంది.
మరి గవర్నమెంట్ రద్దు చేసిన ఆ ఆర్టికల్ ఏంటి? జిమ్ అటాక్ ని పఠాన్, రుబీనా ఎలా ఎదుర్కొన్నారు? అనేది తెరపై చూడాలి.
విశ్లేషణ: పఠాన్ మూవీ విషయానికి వస్తే.. ఈ మూవీకి ముందునుండి వివాదాల ద్వారా హైప్ క్రియేట్ అయ్యింది. వీడియో సాంగ్స్ లో దీపికా డ్రెస్సింగ్ స్టైల్ పై.. షారుఖ్ పై ట్రోల్స్ తీవ్రంగా జరిగాయి.
వాటన్నింటికీ.. ట్రైలర్ లో ‘ఒక సోల్జర్ ఎప్పుడు దేశం తనకోసం ఏం చేసిందని ఆలోచించడు.. దేశం కోసం తనేం చేయగలనా అని ఆలోచిస్తాడు’ అనే డైలాగ్ తో ఫుల్ స్టాప్ పెట్టేశారు.
‘పార్టీ పఠాన్ ఇంట్లో పెట్టుకుంటే.. పఠాన్ తప్పకుండా వస్తాడు. టపాసులు కూడా తెస్తాడు’ అంటూ సాలిడ్ ఓపెనింగ్ తో సినిమా మొదలైంది. కేవలం స్పై థ్రిల్లర్ గా కాకుండా దేశభక్తి పాయింట్ ని ప్రెజెంట్ చేసే ప్రయత్నం చేశారు.
యాక్షన్ పరంగా హాలీవుడ్ మూవీస్ నుండి ఇన్స్పైర్ అయినట్లు తెలుస్తుంది. బట్.. ఇది డిఫరెంట్ మూవీ. ఆరంభం నుండి చివరిదాకా ఓ సాలిడ్ యాక్షన్ ట్రీట్ తో పాటు బ్యాక్ ఎండ్ లో పేట్రియాటిక్ కోర్ తో సాగించారు.
ముందుగా విలన్ జిమ్ క్యారెక్టర్ లో జాన్ అబ్రహంని పరిచయం చేశారు.. దేశంపై అతని ప్రతీకారం, అటాక్ ప్లాన్ గురించి చూపిస్తూనే.. పఠాన్ ఎంట్రీ కోసం ఆసక్తి పెంచేశారు.
ఐ భారీ యాక్షన్ సీక్వెన్స్ తో 'పార్టీ పఠాన్ ఇంట్లో పెడితే.. పఠాన్ తప్పకుండా వస్తాడు, టపాసులు కూడా తెస్తాడు' అనే డైలాగ్ తో షారుఖ్ ఎంట్రీ డిజైన్ చేశారు.
ఆ తర్వాత ఐఎస్ఐ ఏజెంట్ రుబీనా క్యారెక్టర్ లో దీపికా పదుకొనే ఎంట్రీ.. పఠాన్ తో పరిచయం.. లవ్ ట్రాక్.. ఆమె లక్ష్యం.. అలా భారీ యాక్షన్ ఎపిసోడ్స్ మధ్య ఊహించని ట్విస్ట్ తో ఇంటర్వెల్ బ్యాంగ్ అదరగొట్టారు.
పఠాన్ పక్కాగా బాలీవుడ్ తరహా ట్రీట్ మెంట్, ఆ గ్లామర్ టచ్ ఉన్న సినిమా. ఫస్టాఫ్ లో క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేసి.. సెకండాఫ్ లో పఠాన్ క్యారెక్టర్ తో రుబీనా పోరాటం.. విలన్ జిమ్ మాస్టర్ ప్లాన్స్ అన్నీ.. విజువల్ ట్రీట్స్ తో సాగించారు.
సెకండాఫ్ లో మైండ్ బ్లాక్ చేసే ట్విస్ట్ ఒకటి ఉంది. సినిమా సీరియస్ మోడ్ లో వెళ్తుంది కాబట్టి.. కామెడీకి స్కోప్ లేదు. పఠాన్ క్యారెక్టర్ లో షారుఖ్ విశ్వరూపం చూపించాడు. దీపికా అటు సీరియస్.. ఇటు గ్లామరస్ తో అలరించింది.
ప్లస్ లు: షారుఖ్, దీపికా, జాన్ అబ్రహం స్క్రీన్ ప్లే, ట్విస్టులు సినిమాటోగ్రఫీ మ్యూజిక్
మైనస్ లు: ఎక్కువగా హాలీవుడ్ ని పోలిన యాక్షన్ సీన్స్