సినిమాల్లో నటించాలి, స్టార్లు అయిపోవాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. అయితే అందరికీ ఇది సాధ్యం కాదు.

ఫిలిం ఇండస్ట్రీలో నెగ్గుకురావాలంటే ఎంతో పట్టుదల, కృషి ఉండాలి. జయాపజయాలను ఒకేతీరుగా తీసుకునే మనస్తత్వం ఉండాలి. 

వచ్చిన ఛాన్సులను సరిగ్గా వినియోగించుకుంటే బ్యాగ్రౌండ్ లేకున్నా స్టార్ స్టేటస్​ను సొంతం చేసుకోవచ్చని చాలా మంది నిరూపించారు. 

టాలీవుడ్​లో మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ, న్యాచురల్ స్టార్ నాని, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఎలాంటి నేపథ్యం లేకుండా వచ్చి పరిశ్రమలో నిలదొక్కుకున్నారు.  

ఇలా ఇండస్ట్రీలోకి కోటి ఆశలతో వచ్చిన వారిలో యువ నటుడు తిరువీర్ ఒకరు.

జార్జ్ రెడ్డి’, ‘పలాస’, ‘మల్లేశం’ చిత్రాలతో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు తిరువీర్. 

మసూద’ మూవీతో మరో హిట్ కొట్టారు తిరువీర్. ఇందులో ఆయన నటనకు మంచి అప్లాజ్ లభించింది. 

ఇటీవల ‘పరేషాన్’ సినిమాతో మరోసారి ఆడియెన్స్ కు ముందుకొచ్చేశారు తిరువీర్. 

పరేషాన్’ మూవీకి మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చేసింది. సినిమా బాగుందని రివ్యూలు పడ్డాయి. 

అయితే సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడంలోనూ, పబ్లిసిటీ పైన ‘పరేషాన్’ మూవీ టీమ్ అంతగా దృష్టి పెట్టనట్లు కనిపించింది. 

దీంతో సినిమా బాగున్నా, మంచి టాక్ వచ్చినా.. కలెక్షన్లు మాత్రం ఊహించినంత రాలేదని విశ్లేషకులు అంటున్నారు.

ఇది అటుంచితే.. ఒక్కో సినిమాతో నటుడిగా ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటున్న తిరువీర్ ఒక కొత్త కారు కొన్నారు. 

టాటా సంస్థకు చెందిన హ్యారియర్ కారును తిరువీర్ కొన్నట్లు తెలుస్తోంది. దీని ధర సుమారుగా రూ.19 లక్షల వరకు ఉంటుందని సమాచారం.

కొత్త కారు కొన్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్​కు తెలియజేశారు తిరువీర్. ఇక ఎండలు, వానల వల్ల పరేషాన్ లేదన్నారు.

ఫ్యామిలీలోకి కొత్త పిలగాడు వచ్చిండని.. వెల్​కమ్​ అంటూ తిరువీర్ ట్వీట్ చేశారు. మీ ప్రేమ వల్లే ఇది సాధ్యమైందంటూ ఫ్యాన్స్​కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.