దేశ ప్రధాని స్థాయి వ్యక్తికి ప్రజలు ఇచ్చే గౌరవమర్యాదల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కీలకమైన ప్రతి నిర్ణయం ప్రధాని చేతుల్లోనే ఉంటుంది.
అంతటి ముఖ్యమైన పదవిలో ఉండే వ్యక్తులు ఎంతో హుందాగా ప్రవర్తించాలి లేదంటే అభాసుపాలవ్వక తప్పదు.
పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ విషయంలో ఇది మరోమారు ప్రూవ్ అయింది.
పాక్ పీఎం షరీఫ్ ప్రస్తుతం రెండ్రోజుల పాటు ఫ్రాన్స్ పర్యటనలో ఉన్నారు.
పారిస్‌లో జరిగిన ఒక సదస్సులో పాల్గొనేందుకు షెహబాజ్ షరీఫ్ బయల్దేరారు. అయితే అదే టైమ్‌లో అక్కడ వర్షం కురిసింది.
షెహబాజ్ షరీఫ్ తడవొద్దనే ఉద్దేశంతో ఆయన కారు దిగిన వెంటనే ఒక మహిళా ప్రోటోకాల్ అధికారి గొడుగు పట్టుకొని నిల్చున్నారు.
కానీ పాక్ పీఎం మాత్రం ఏదో మాట్లాడి ఆ ఆఫీసర్ చేతుల్లో ఉన్న గొడుగును తీసుకొని వెళ్లిపోయారు.
షెహబాజ్ షరీఫ్ గొడుగు తీసుకెళ్లిపోవడంతో పాపం.. ఆ మహిళా అధికారి వర్షంలో తడిసి ముద్దయ్యారు.
పాక్ పీఎం ఆఫీస్ అఫీషియల్ వెబ్సైట్లో పోస్ట్ అయిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మహిళా ఆఫీసర్‌ను ప్రధాని అలా వర్షంలో వదిలి వెళ్లడాన్ని నెటిజన్స్ తప్పుబడుతున్నారు.
షెహబాజ్ షరీఫ్‌కు అసలు మనసే లేదని.. కనీసం కనికరం కూడా లేకుండా ఆయన మహిళా అధికారితో ప్రవర్తించారని ఫైర్ అవుతున్నారు.
ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.