యావత్ దేశ ప్రజల్ని ఉలిక్కిపడేలా చేసిన ఒడిషా రైలు ప్రమాదానికి ప్రధాన కారణం ఏంటనేది బయటపడింది.

రైళ్లను సేఫ్​గా నడపడంలో కీలకంగా భావించే ‘ఎలక్ట్రానిక్ ఇంటర్​లాకింగ్ సిస్టమ్​’లో మార్పులు చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తేలింది.

ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందా, విధ్వంసం సృష్టించాలనే దురాలోచనతోనే ఇలా చేశారా అనేది నిగ్గు తేల్చేందుకు సీబీఐని రంగంలోకి దించుతున్నారు. 

ఈ యాక్సిడెంట్​లో రైళ్లను నడుపుతున్న లోకోపైలట్ల తప్పు లేదని ఉన్నతాధికార వర్గాలు క్లీన్ చిట్ ఇచ్చాయి.

రైళ్లను నడుపుతున్న డ్రైవర్ల తప్పు లేదని తేలడంతో ఇప్పుడు ఇంటర్​లాకింగ్ వ్యవస్థ ప్రధానంగా మారింది. 

మూడు రైళ్లు పరస్పరం ఢీకొన్న ఘటనపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు. 

తమ ఇన్వెస్టిగేషన్ పూర్తయిందన్న అశ్వినీ వైష్ణవ్.. ఈ ప్రమాదానికి ప్రధాన కారణమేమిటి, దీనికి బాధ్యులు ఎవరనేది తేలిందన్నారు. 

పాయింట్ మెషీన్ సెట్టింగ్​ను మార్చడం వల్లే రైలు ప్రమాదం జరిగిందని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. 

పాయింట్ మెషీన్ సెట్టింగ్​ను ఎలా మార్చారు, ఎవరు మార్చారు అనేది రైల్వే భద్రత కమిషనర్ (సీఆర్ఎస్) రిపోర్టులో బయటపడుతుందని అశ్వినీ వైష్ణవ్ చెప్పుకొచ్చారు. 

కాగా, ప్రమాదానికి కీలకంగా భావిస్తున్న ఇంటర్​లాకింగ్ వ్యవస్థను ఎవరు మార్చారు? దీని వెనుక భారీ స్కెచ్ ఉందా? అనే ప్రశ్నలు రైల్వే అధికారులను వేధిస్తున్నాయి. 

పెను విధ్వంసం సృష్టించాలనే దురుద్దేశంతో కొందరు వ్యక్తులు.. ఇంటర్​లాకింగ్ సిస్టమ్​లో మార్పులు చేసి ఉంటారని ఆఫీసర్స్ అనుమానిస్తున్నారు.

ఒకే పట్టాల పైకి ఒకే టైమ్​లో రెండు రైళ్లు రాకుండా రూట్​ను సుగమం చేసేందుకు ఉద్దేశించిన సిగ్నల్ వ్యవస్థను ‘ఇంటర్​లాకింగ్’ అంటారు.