ఉమెన్స్ క్రికెట్లో 2024 నుంచి 2027 వరకు జరిగే ఐసీసీ మెగా ఈవెంట్ల వేదికలను ప్రకటించింది.
మొత్తం నాలుగు మెగా టోర్నీల్లో మూడు ఉపఖండంలోనే జరగనుండడం విశేషం.
ఉపఖండపు దేశాల్లో ఏ మెగా టోర్నీ జరిగినా అది సూపర్ హిట్ అవుతుంది.
ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2024 బంగ్లాదేశ్‌లో జరగనుంది.
ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2024 బంగ్లాదేశ్‌లో జరగనుంది.
ఆ తర్వాత 2025లో ఐసీసీ ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది.
ఇండియాలో జరిగే వన్డే వరల్డ్ కప్‌లో మొత్తం 8 జట్లు పాల్గొంటాయి. 31 మ్యాచ్‌లు జరుగుతాయి.
2026లో జరిగే ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ ఇంగ్లండ్‌లో జరగనుంది.
ఇంగ్లండ్‌లో జరిగే వరల్డ్ కప్‌లో 12 జట్ల మధ్య 33 మ్యాచ్‌లు జరగనున్నాయి.
2027 ఉమెన్స్ ఛాంపియన్స్ ట్రోఫీకి శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనుంది.
6 జట్ల మధ్య 16 మ్యాచ్‌లు ఉమెన్స్ ఛాంపియన్స్ ట్రోఫీలో జరుగుతాయి.
అలాగే పురుషుల క్రికెట్‌కు సంబంధించి 2023-27 మధ్య జరిగే టోర్నీలను కూడా ఐసీసీ ఫైనల్ చేసింది
వీటికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.
అలాగే ఐసీసీ చైర్మన్ పదవికి ఈ ఏడాది నవంబర్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం జార్జ్ ఐసీసీ చైర్మన్‌గా ఉన్నారు.