ప్రతీ ఏటా లాగే ఈ ఏడు కూడా న్యూయర్ సెలెబ్రేషన్స్ సందర్భంగా మందు ఏరులై పారింది.
మందు బాబుబు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు భారీ సంఖ్యలో ఆదాయం తెచ్చేశారు.
31వ తేదీన దేశ వ్యాప్తంగా వేల కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయి.
ఆంధ్రప్రదేశ్‌లో డిసెంబర్ 29న 72 కోట్ల రూపాయలు, డిసెంబర్ 30న 86 కోట్ల రూపాయలు, డిసెంబర్ 31న 127 కోట్ల రూపాయల మద్యం అమ్ముడైంది.
మొత్త మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ 285.3 కోట్ల అమ్మకాలు సాధించింది.
సంక్రాంతికి కూడా ఇదే విధంగా మద్యం అమ్మకాలు ఉండే అవకాశం ఉందని ఏపీ ప్రభుత్వం అనుకుంటోంది.
ఇక, మద్యం అమ్మకాల్లో ఏపీ కంటే తెలంగాణ ఓ మెట్టు పైనే ఉంది.
31వ తేదీన ఏపీలో 127 కోట్ల రూపాయల అమ్మకాలు జరగ్గా.. తెలంగాణలో 215 కోట్ల రూపాయల అమ్మకాలు జరిగాయి.
జనవరి 1వ తేదీన కూడా మద్యం అమ్మకాల్లో ఇదే ఊపు కొనసాగింది.
నూతన సంవత్సరం తొలి రోజు ఆదివారం కావటంతో మద్యం ప్రియులు రచ్చ చేశారు.