చిన్నాపెద్దా లేకుండా అందరినీ వేధిస్తున్న సమస్యలో 'అధిక బరువు' ప్రధానమైనది. కారణాలు ఏమైనప్పటికీ.. రోజురోజుకి ఈ సమస్య ఎక్కువవుతోంది.
ఉరుకుల పరుగుల జీవితంలో ఎక్సర్ సైజ్ చేసే తీరిక లేక.. సులభంగా బరువు తగ్గే పద్ధతులని చూస్తున్నారు.
అందులో భాగంగానే గ్రీన్ టీ తాగుతూ బరువు తగ్గే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందనే నిపుణులు అంటున్నారు.
అయితే గ్రీన్ టీ మితంగా తాగితే పర్వాలేదు కానీ అది ఎక్కువైతే మాత్రం తిప్పలు తప్పవని వైద్యులు చెబుతున్నారు.
గ్రీన్ టీ ఎక్కువగా తాగడం వల్ల కడుపు నొప్పి, కండరాల నొప్పి, అలర్జీ తదితర అనారోగ్య సమస్యలు వస్తాయి.
గ్రీన్ టీ మోతాదు ఎక్కువైతే బ్లడ్ లోని షుగర్ లెవల్స్ నియంత్రణ లేకుండా పోతాయి. గుండె కొట్టుకోవడంలో కూడా మార్పులొస్తాయి.
గ్రీన్ టీ ఎక్కువ తీసుకుంటే.. గ్యాస్, కడుపులో అసౌకర్యంగా ఉండటం లాంటి జీర్ణ సంబంధిత సమస్యలు కూడా వస్తాయి.
దీన్ని ఎక్కువగా తాగడం వల్ల తలనొప్పి, నిద్రలేమి ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశముందని నిపుణులు అంటున్నారు.
అలానే గ్రీన్ టీ ఎక్కువ తాగితే.. కాలేయం అనారోగ్యానికి గురై.. కామెర్ల వ్యాధి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. రక్తస్తావ రుగ్మతలు కూడా వచ్చే ఛాన్స్ ఉంది.
గ్రీన్ టీ ఎక్కువగా తాగడం వల్ల ఐరన్ గ్రహించే శక్తిని శరీరం క్రమంగా కోల్పోతుంది. దీంతో మనలో ఐరన్ లోపం సమస్యలు తలెత్తుతాయి.
దీని ఎక్కువగా తాగితే ఎముకులపై కూడా ప్రభావం చూపిస్తుంది.
అలానే బరువు తగ్గాలనుకునేవారు కూడా గ్రీన్ టీ మితంగానే తాగండి.
లేదంటే అది రివర్స్ అయ్యే ఛాన్సులు కూడా ఉన్నాయి. దీని ప్రకారం రోజుకి రెండు కప్పుల కంటే ఎక్కువ గ్రీన్ టీ తాగొద్దు.