హైదరాబాద్ లో అన్ని సదుపాయాలు ఉన్న ఏరియాలో ఫ్లాట్ కొనాలంటే 1 బీహెచ్‌కేకే రూ. 30 లక్షల నుంచి రూ. 35 లక్షలు అవుతుంది.
ఇక 2 బీహెచ్‌కే ఫ్లాట్ కొనాలంటే కనీసం రూ. 40 లక్షలు పెట్టుకోవాల్సిందే.
మరి తక్కువ బడ్జెట్ లో ఫ్లాట్స్ ఉండవా అంటే ఉంటాయి. రూ. 35 లక్షల బడ్జెట్ లో 2 బీహెచ్‌కే ఫ్లాట్స్ అందుబాటులో ఉన్నాయి.
హైటెక్ సిటీ, మాదాపూర్ ఏరియాలకు 10 కి.మీ. దూరంలో ఉన్న నిజాంపేట్ ఏరియాలో ఈ ఫ్లాట్స్ అందుబాటులో ఉన్నాయి.
ఈ ఏరియాలో చదరపు అడుగు ధర కనిష్టంగా రూ. 3,200 ఉండగా.. సగటు ధర రూ. 4300, గరిష్ట ధర రూ. 4900 గా ఉంది.
ఈ ఏరియాలో 2 బీహెచ్‌కే ఫ్లాట్ కొనాలంటే రూ. 32 లక్షల నుంచి రూ. 49 లక్షల బడ్జెట్ అవుతుంది.
మల్టీస్టోరే అపార్ట్మెంట్ లో చదరపు అడుగు రూ. 3,700, రూ. 4,800, రూ. 6,000 అవుతుంది.
2 బీహెచ్‌కే ఫ్లాట్ కొనాలంటే రూ. 37 లక్షల నుంచి రూ. 60 లక్షలు అవుతుంది. ఇవి బిల్డర్ ఫ్లోర్లు.
అదే ఓనర్స్ ఫ్లాట్స్ కొనాలంటే చదరపు అడుగు రూ. 3043, రూ. 3500, రూ. 4068 చొప్పున రూ. 30 లక్షల నుంచి రూ. 40 లక్షలు అవుతుంది.
కూకట్ పల్లికి నిజాంపేట్ 6.5 కి.మీ. దూరంలో ఉంది. 20 నిమిషాల సమయం పడుతుంది.
హైదరాబాద్ లో ఈ బడ్జెట్ లో 2 బీహెచ్‌కే ఫ్లాట్ దొరుకుతుందంటే మంచి విషయమే.
గమనిక: ఈ ధరలు అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. ఈ ధరల్లో మార్పులు ఉండచ్చు.
అలానే పైన చెప్పబడిన ప్రాంతంలో ప్రాపర్టీ కొనే ముందు నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవాల్సిందిగా మనవి.