మాంసాహార ప్రియులకు ఎల్లప్పుడూ రకరకాల మాంసాహారాలు మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి.
చికెన్, మటన్, చేపలు, రొయ్యల వంటి మాంసాహారాలు విరివిగా దొరుకుతుంటాయి.
అయితే, వీటిలో చాలా మంది తరచుగా చికెన్, మటన్ మాత్రమే తింటూ ఉంటారు.
వారానికి ఒకసారి, రెండు సార్లు, అంతకు మించి తినే వారు కూడా ఉన్నారు.
మరి, చికెన్, మటన్‌లో ఏది తింటే మంచిది? వేటి వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
చికెన్ : చికెన్‌లో కొవ్వు తక్కువగా ఉండి, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి.
చికెన్ స్కిన్‌తో పాటు తింటే కొవ్వు ఎక్కువగా శరీరంలోకి చేరుతుంది.
అందుకే కొవ్వులు అవసరం లేని వాళ్లు చికెన్ ను ఎప్పుడూ కూడా స్కిన్ లేకుండానే తినటం మంచిది.
కండరాల సమస్యలు ఉన్న వారు.. జిమ్ చేసే వారు.. శారీరకంగా కష్టపడేవారు చికెన్ తినటం మంచిది.
కిడ్నీ వ్యాధితో బాధపడేవారు చికెన్‌కు దూరంగా ఉండాలి.
మటన్: మటన్‌లో కొవ్వు, కొలెస్ట్రాల్,ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి.
మటన్ ఎంత లేతగా ఉంటే అంత రుచిగా ఉంటుంది. ఇందులో కొవ్వు తక్కువగా ఉండటం వల్ల ఆరోగ్యానికి మంచిది.
హైబీపీ, గుండెజబ్బులు ఉన్నవారికి లేత మటన్ బెస్ట్ ఛాయిస్.