ఓ 20, 30 ఏళ్ళ పాటు ఈఎంఐ కడుతూనే ఉండాలి. లోన్ క్లియర్ అయ్యే సమయానికి తీసుకున్న దానికి మూడు రెట్లు అవుతుంది కట్టే ఈఎంఐ.
లోన్ అంటే భయపడి.. ఇల్లు కట్టుకోవాలన్న కల కనడానికి భయపడే పేదల కోసం ఓ యువకుడు కేవలం రూ. 7.5 లక్షలకే ఇల్లు నిర్మిస్తున్నాడు.
సొంతిల్లు కావాలని కోరుకునే పేదవారికి రూ. 7.5 లక్షలకే ఇల్లు అందిస్తున్నాడు మిహిర్ మెండా.
మిహిర్ అమెరికాలో చదువుకుని వచ్చాడు. ‘అర్బన్ అప్’ పేరుతో ఒక స్టార్టప్ కంపెనీని ప్రారంభించాడు.
పేదలకు ఇల్లు కట్టుకోవడం సవాలుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి తక్కువ ఖర్చుతో ఇల్లు నిర్మించి ఇస్తున్నాడు.
7.5 లక్షలకు నాణ్యమైన ఇంటిని కట్టి ఇస్తున్నాడు. అయితే నిర్మాణానికి అయ్యే ఖర్చును దాతల నుంచి వస్తుంది. అందుకే తక్కువ ధరకే నాణ్యమైన ఇళ్లను నిర్మిస్తున్నాడు.
ఈ ఇళ్ల నిర్మాణంలో నిర్మాణ వ్యర్థాలు, పాత ఇటుకలను వాడుతున్నారు.
ఇప్పటి వరకూ బెంగళూరులో 700 మంది సొంతింటి కలను నిజం చేసుకున్నారు.
ప్రతీ ఇంటిని 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తారు.
పేదల కోసం నిర్ణయించిన ధర ఏడున్నర లక్షలు అయితే లబ్ధిదారులు రూ. 2 లక్షలు డౌన్ పేమెంట్ కింద చెల్లించాలి.
మిగతా అమౌంట్ ని సులభ వాయిదా పద్ధతిలో చెల్లించాల్సి ఉంటుంది. ఈ వాయిదా డబ్బు ఆ కుటుంబ ఆదాయంలో 10 శాతం ఉంటుంది.
లబ్ధిదారుని జీతం రూ. 15 వేల నుంచి రూ. 25 వేలు ఉంటే నెలకు రూ. 1500 నుంచి రూ. 2500 వరకూ ఈఎంఐ ఉంటుంది.
ఈ వాయిదాలు 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ళ వరకూ ఉంటుంది. పైగా వడ్డీ కూడా ఉండదు.