చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో అని కందుకూరి వీరేశలింగం పంతులు అన్నారు.

చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో అని కందుకూరి వీరేశలింగం పంతులు అన్నారు.

ఆయనేమీ ఊరికే అనలేదు. పుస్తకాలు చదివితే జ్ఞానం, జ్ఞాపకశక్తి పెరుగుతాయి.

డైలీ పుస్తకం చదివే వ్యక్తులకు ఒత్తిడి ఉండదనేది నిపుణుల మాట. మానసిక ప్రశాంతత లభిస్తుంది.

జీవితంలో ఫెయిల్ అయ్యామనుకుని నిరాశ, నిస్పృహకి గురయ్యేవారు స్ఫూర్తిదాయకమైన వ్యక్తుల కథలు చదివితే మానసికంగా ధైర్యంగా ఉంటారు.

పుస్తకాలు చదివితే జీవితాన్ని చూసే కోణం మారిపోతుంది. ఆలోచనా శక్తిని పెంచుతుంది.

పుస్తకాలు చదివితే సమస్యలను పరిష్కరించగలిగే సామర్థ్యం పెరుగుతుంది.

కథల్లో ఉండే పాత్రలు అనుభవించిన కష్టాల నుంచి, సమస్యల నుంచి బయటపడిన విధానాన్ని నిజ జీవితంలో అప్లై చేసుకునే ధైర్యం ఉంటుంది.

మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే విశ్రాంతి చాలా అవసరం. కానీ విశ్రాంతి సమయంలో స్మార్ట్ ఫోన్లు, టీవీలు, ల్యాప్ టాప్ లతో గడుపుతారు.

ఎలక్ట్రానిక్ వస్తువుల డిస్ప్లే కంటికి అంత మంచిది కాదు. వాటి స్క్రీన్ ను చూడడం వల్ల కంటి సమస్యలు, మానసిక ఆరోగ్య సమస్యలు కలుగుతాయి.

ఇలా కాకుండా పుస్తకం చదివితే ఎలాంటి సమస్యలు ఉండవు.

పుస్తకాలు చదవడం వల్ల డిప్రెషన్ పోతుందని మానసిక వైద్యులు సూచిస్తారు.

నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వారు పుస్తకం చదవాలని డాక్టర్లు సూచిస్తారు.

పుస్తకం చదవడం వల్ల నిద్రలోకి జారుకుంటారు. దీని వల్ల నిద్ర గాఢంగా పడుతుంది.

కాబట్టి పుస్తకం చదవడం ఒంటికి మంచిదే.