టాటా, విప్రో కంపెనీలకు దగ్గరలో రూ. 22 లక్షలకే 150 గజాల స్థలం సొంతం చేసుకోవచ్చు.

హైదరాబాద్ కి 37 కి.మీ. దూరంలో ఉన్న మహేశ్వరంలో తక్కువ ధరకే ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి.  

రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, అవుటర్ రింగ్ రోడ్, ఈ-సిటీ, హార్డ్ వేర్ పార్క్, అమెజాన్ డేటా సెంటర్, ఫాక్స్ కాన్ కంపెనీలకు దగ్గరలో ఉంది ఈ ఏరియా.

అలానే షాపింగ్ మాల్స్, టెంపుల్స్ కి, హైదరాబాద్-శ్రీశైలం హైవేకి చాలా దగ్గరగా ఉంది. 

అలానే స్కూల్స్, హాస్పిటల్స్, ట్రాన్స్ పోర్ట్ వంటి సదుపాయాలు ఉన్నాయి. 

టాటా, విప్రో సెజ్, హెచ్సీఎల్, ఫ్యాబ్ సిటీ, ఫార్మా సిటీ వంటి వాటికి మహేశ్వరం చాలా దగ్గర. గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కి చేరుకోవాలంటే మహేశ్వరం నుంచి 20 నిమిషాల టైం పడుతుంది.

2 బీహెచ్కే, 3 బీహెచ్కే, 4 బీహెచ్కే ఫ్లాట్ లు, 3 బీహెచ్కే, 4 బీహెచ్కే విల్లాలు ఈ ఏరియాలో బడ్జెట్ లో దొరుకుతున్నాయి.

తక్కువ బడ్జెట్ లో పెట్టుబడి పెట్టడానికి మహేశ్వరం అనేది బెస్ట్ ఛాయిస్. ఫాస్ట్ అప్రిసియేషన్ అనేది వస్తుంది.

వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏరియా, ఎక్కువ కంపెనీలు ఉన్న కారణంగా రానున్న రోజుల్లో మహేశ్వరం మరో హైటెక్ సిటీ కాబోతుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మహేశ్వరం ఏరియాలో గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ రూ. 19.9 లక్షల నుంచి 3.12 కోట్ల రేంజ్ లో ఉన్నాయి.

చదరపు అడుగు రూ. 1,444 నుంచి రూ. 5,700 మధ్యలో ఉన్నాయి. 

ఇక స్థలం ధర అయితే సగటున చదరపు అడుగుకు రూ. 1650 పలుకుతోంది. 

ఈ రేటుతో 150 గజాల స్థలం కొనాలంటే రూ. 22 లక్షలవుతుంది. ఇంకో 20, 25 లక్షలు పెట్టుకుంటే సొంతంగా ఇల్లు కట్టుకోవచ్చు.

ఈ బడ్జెట్ లో స్థలం, 2 బీహెచ్కే ఫ్లాట్ అనేవి దొరకడం అసాధ్యం. 

కానీ మహేశ్వరంలో గేటెడ్ కమ్యూనిటీస్ లో తక్కువ ధరకే ఫ్లాట్లు, ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి.

గమనిక: ఈ ధరల్లో హెచ్చుతగ్గులు అనేవి ఉంటాయి. స్థలం లేదా ఫ్లాట్ కొనుగోలు చేసే ముందు స్థానిక రియల్ ఎస్టేట్ ఏజెంట్లను గానీ యజమానులను గానీ సంప్రదించవలసిందిగా మనవి. 

పై కథనం కేవలం మీకు అవగాహన కల్పించడం కోసం ఇవ్వబడింది.ప్రాపర్టీ మీద పెట్టుబడి పెట్టడం పూర్తిగా మీ బాధ్యత మాత్రమే.