కృష్ణా జిల్లాలోని పూణె-మచిలీపట్నం ఎన్ హెచ్-65, కత్తిపూడి-ఒంగోలు ఎన్ హెచ్-216 జాతీయ రహదారుల పనులు పూర్తయిన సంగతి తెలిసిందే.
మరోవైపు మచిలీపట్నం ఓడరేవు నిర్మాణ పనులు స్టార్ట్ అయ్యాయి.
ఈ రెండు కారణాల వల్ల రియాల్టర్లు, పెట్టుబడిదారులు కృష్ణా జిల్లా రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
విస్తారమైన పొలాలు, పుష్కలమైన నీటి వనరులు, రవాణా సదుపాయాలు బాగా ఉండడం కూడా రియాల్టర్లను ఆకర్షిస్తోంది.
తాడిగడప, పోరంకి, కంకిపాడు, పెనమలూరు, గూడూరు, ఉయ్యూరు, మచిలీపట్నం నుండి ఎన్ హెచ్ 65 పక్కన 70 కి.మీ. వరకూ బిల్డర్లు, రియాల్టర్లు వెంచర్లను ఏర్పాటు చేస్తున్నారు.
ఇప్పటికే మచిలీపట్నం-విస్సన్నపేట స్టేట్ హైవే పక్కన మచిలీపట్నం, గుడివాడ మధ్య ఏరియాల్లో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను చేపట్టారు.
హుస్సేన్ పాలెం, వలంద పాలెం,వడ్లమన్నాడు, పెడన, అంగలూరు, గుడ్లవల్లేరు, బొమ్మలూరు, గుడివాడ ఏరియాల్లో ఈ ప్రాజెక్టులను చేపడుతున్నారు.
మచిలీపట్నం హైవే దగ్గరలో ఎకరం రూ. 3 కోట్లు నుంచి రూ. 5 కోట్లు పలుకుతోంది. గతంలో ఇది రూ. 40 లక్షల నుంచి రూ. 2 కోట్లు పలికేది.
ఇక హైవేకి దూరంగా ఉన్న గ్రామాల్లో అయితే ఎకరం భూమి రూ. 30 లక్షల నుంచి రూ. 40 లక్షలకు పెరిగింది. గతంలో రూ. 15 లక్షల నుంచి రూ. 25 లక్షలు ఉండేది.
రేట్లు అధికంగా ఉన్నా కూడా ఫ్యూచర్ లో పెరుగుతాయని చెప్పి రియాల్టర్లు భూములను కొనుగోలు చేసి వెంచర్స్ ని స్టార్ట్ చేస్తున్నారు.
మచిలీపట్నం సమీపంలో చదరపు అడుగు రూ. 10 వేల చొప్పున స్థలాలను అమ్ముతున్నారు. కంకిపాడు, పెనమలూరు ప్రాంతాల్లో అయితే ఈ రేటు డబుల్ అయ్యింది.
రామవరప్పాడు, పోరంకి, పెనమలూరు, మచిలీపట్నం ప్రాంతాల్లో గజం రూ. 5,400 నుంచి రూ. 45 వేల మధ్యలో పలుకుతోంది.
ఇప్పుడు ల్యాండ్ కొన్న వారికి భవిష్యత్తులో మంచి లాభాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. పైన చెప్పిన వాటిలో మార్పులు ఉండచ్చు.
అలానే ప్రాపర్టీ కొనే ముందు నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవాల్సిందిగా మనవి.