నిరుపమ్ పరిటాల.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు.
'కార్తీక దీపం' సీరియల్ లో డాక్టర్ బాబు పాత్రలో నిరుపమ్ నటన అందరిని ఆకట్టుకుంది.
నిరుపమ్, ప్రేమ విశ్వనాథ్ పాత్రలే ఆ సీరియల్ కు ప్రధాన ఆకర్షణలా మారాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతీ గడపలో వీరిద్దరు అంతలా ఫేమస్ అయ్యారు.
హీరోల రేంజ్ లో నిరుపమ్ పరిటాలకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
అయితే ఆ ఫాలోయింగ్ ను నిరుపమ్ సోషల్ మీడియా ద్వారా ఇంకా పెంచేసుకున్నాడు.
నిరుపమ్ స్వతహాగా రైటర్ కావడంతో అదిరిపోయే పంచ్ లు, కౌంటర్లు వేస్తూ అందరిని అలరిస్తుంటాడు.
ఛానల్ లో హిట్లర్ గారి పెళ్ళాం అనే సీరియల్ ను నిరుపమ్ పరిటాల నిర్మించాడు.
నిరుపమ్ భార్య మంజుల కూడా నటిగా బుల్లితెరపై రాణిస్తుంది.
ఇక పరిటాల నిరుపమ్, పరిటాల శ్రీరామ్ గురించి ఓ ఆసక్తిక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
చాలా మంది వీరిద్దరి ఇంటి పేర్లు ఒకటి కావడంతో బంధువులని భావించారు.
పరిటాల శ్రీరామ్ వాళ్ల రిలేషన్ గురించి నిరుపమ్ ఓ ఇంటర్వ్యూలో క్లారీటి ఇచ్చారు.
పరిటాల శ్రీరామ్ కు, తమకు ఎలాంటి రిలేషన్ లేదని నిరుపమ్ క్లారిటీ ఇచ్చారు.
తాజాగా అనంతపురం టీడీపీ యువనేత పరిటాల శ్రీరామ్ ని నిరుపమ్ పరిటాల కలిశాడు.
కార్తీక దీపం టీమ్ తో కలసి నిరుపమ్.. పరిటాల శ్రీరామ్ ను తో కలిశారు.
ఇదే సందర్భంలో శ్రీరామ్ తో కలసి నిరుపమ్ ఫోటోలు సైతం దిగారు.