మగవారే కాకుండా మహిళలు కూడా రోజూ ఆఫీసులకు, పనులకు వెళ్తున్నారు.
వీరంతా బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు.
అయితే మహిళల కోసం టికెట్ లేకుండా ఉచితంగా ప్రయాణం చేసే సదుపాయాన్ని కల్పించారు.
మహిళలు ఉచితంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా టికెట్ అవసరం లేకుండా ప్రయాణం చేయవచ్చునని రవాణా శాఖ బంపర్ ఆఫర్ ప్రకటించింది.
జూన్ 1 నుంచి మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణం చేయవచ్చునని రవాణా శాఖ మంత్రి వెల్లడించారు.
ప్రభుత్వ ఆర్టీసీ బస్సుల్లో టికెట్ లేకుండా, ఎలాంటి షరతులూ లేకుండా మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చునని రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి వెల్లడించారు.
కర్ణాటకలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నెరవేర్చుకునేందుకు సిద్ధమైంది.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని అమలు చేస్తున్నట్లు కర్ణాటక రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి తెలిపారు.
పని చేసే మహిళలైనా, గృహిణులైనా ఎవరైనా సరే టికెట్ లేకుండా ఉచితంగా బస్సులో ప్రయాణం చేయవచ్చునని అన్నారు.
కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎంతమంది ఉంటే అంతమందీ ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయవచ్చునని అన్నారు.
కర్ణాటక స్టేట్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్, నార్త్ వెస్ట్ కర్ణాటక రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్, కల్యాణ కర్ణాటక రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్, బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ మొత్తం నాలుగు ప్రభుత్వ రవాణా కార్పొరేషన్లు ఉన్నాయి.
ఈ నాలుగు కార్పొరేషన్ల నిర్వహణకు 2022-23 ఏడాదిలో రూ. 12,750 కోట్లు ఖర్చయ్యిందని మంత్రి రామలింగారెడ్డి వెల్లడించారు.
ఈ ఖర్చును ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వమే భరిస్తుంది.
కర్ణాటకలో నిత్యం 40 లక్షల మంది మహిళలు ప్రయాణం చేస్తున్నారు.
వీరందరికీ ఉచితంగా బస్సులో ప్రయాణం చేసేలా కర్నాటకా ప్రభుత్వం సదుపాయం కల్పించింది.