టాలీవుడ్ హీరోల్లో కల్యాణ్ రామ్ కాస్త విభిన్నమనే చెప్పాలి.
రెగ్యులర్ సినిమాలు కాకుండా కథాబలం ఉన్న వెరైటీ చిత్రాలు చేసేందుకు కల్యాణ్ రామ్ ఆసక్తి చూపిస్తుంటారు.
కంటెంట్ తర్వాతే మిగతా విషయాలకు ఈ నందమూరి హీరో ప్రాధాన్యం ఇస్తుంటారు.
‘బాల గోపాలం’ చిత్రంతో తెరంగేట్రం చేశారు కల్యాణ్ రామ్. ఈ మూవీలో ఆయన చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించారు.
హీరోగా కల్యాణ్ రామ్ చేసిన ఫస్ట్ మూవీ ‘అభిమన్యు’. అయితే ఈ సినిమా అంతగా ఆడలేదు.
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘అతనొక్కడే’తో ఫస్ట్ హిట్ కొట్టారు కల్యాణ్ రామ్.
‘అతనొక్కడే’ తర్వాత పలు చిత్రాలు చేసినప్పటికీ ఆయనకు సరైన హిట్ పడలేదు. అయితే అనిల్ రావిపూడి రూపొందించిన ‘పటాస్ ’ కల్యాణ్ రామ్ కు మరో మెగా హిట్ ను అందించింది.
గత సంవత్సరం ‘బింబిసార’తో మరో బ్లాక్ బస్టర్ కొట్టారు కల్యాణ్ రామ్. ప్రస్తుతం ఆయన ‘డెవిల్’ అనే ఫిల్మ్‌లో యాక్ట్ చేస్తున్నారు. ’ కల్యాణ్ రామ్ కు మరో మెగా హిట్ ను అందించింది.
కల్యాణ్ రామ్ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. ఆయన భార్య పేరు స్వాతి. పెద్దలు కుదిర్చిన వివాహం వీళ్లది.
కల్యాణ్ రామ్ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. ఆయన భార్య పేరు స్వాతి. పెద్దలు కుదిర్చిన వివాహం వీళ్లది.
కల్యాణ్ రామ్-స్వాతి దంపతులకు ఇద్దరు సంతానం. కల్యాణ్ రామ్ భార్య వృత్తిపరంగా డాక్టర్.
మ్యారేజ్ తర్వాత స్వాతి తన జాబ్‌ను వదిలేశారు. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ఆమెకు ఇష్టమైన హీరో అక్కినేని నాగార్జున కావడం విశేషం.
నాగ్ యాక్ట్ చేసిన ‘మన్మథుడు’ మూవీని స్వాతి లెక్కలేనన్ని సార్లు చూశారట.
కాలేజ్ డేస్‌లో నాగ్ చిత్రం వస్తోందంటే చాలు.. క్లాసులకు బంక్ కొట్టి మరీ ఫ్రెండ్స్‌తో కలసి థియేటర్లలో వాలిపోయేవారట స్వాతి.