పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీసీఐఎల్) ఫీల్డ్ ఇంజనీర్, ఫీల్డ్ సూపర్వైజర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
బీటెక్, డిప్లొమాలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లో 55 శాతం ఉత్తీర్ణత సాధించి ఉండాలి..
బీటెక్, డిప్లొమా పాస్ మార్కులతో పాస్ అయినా కూడా ఉద్యోగం వస్తుంది. 25 వేల నుంచి 30 వేల జీతం ఇస్తుంది. అనుభవం ఉంటే లక్షకు పైగా జీతం వస్తుంది.
మొత్తం ఖాళీలు: 800 ఫీల్డ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) ఖాళీలు: 50 ఫీల్డ్ ఇంజనీర్ (ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్) ఖాళీలు: 15
ఫీల్డ్ ఇంజనీర్ (ఐటీ) ఖాళీలు: 15 ఫీల్డ్ సూపర్వైజర్ (ఎలక్ట్రికల్): 480 ఫీల్డ్ సూపర్వైజర్ (ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్): 240
అర్హతలు: ఫీల్డ్ ఇంజనీర్/ఫీల్డ్ సూపర్వైజర్ పోస్టుకి దరఖాస్తు చేసుకోదలచుకునే వారు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్/బీఎస్సీ డిగ్రీ చేసి ఉండాలి.
లేదా తత్సమాన కోర్సు చేసి ఉండాలి. కనీసం 55 శాతం ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
సంబంధిత విభాగంలో డిసిప్లిన్ కలిగి ఉండాలి. సంబంధిత రంగంలో ఏడాది పాటు పని చేసిన అనుభవం ఉండాలి.
ఫీల్డ్ ఇంజనీర్/ఫీల్డ్ సూపర్వైజర్ పోస్టుకి దరఖాస్తు చేయదలచిన ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు బీటెక్, డిప్లొమా పాసైతే చాలు. ఉద్యోగానికి అర్హులుగా పరిగణించబడతారు.
ఫీల్డ్ ఇంజనీర్ జీత భత్యాలు: నెలకు రూ. 30 వేల నుంచి రూ. లక్ష 20 వేలు
ఫీల్డ్ సూపర్వైజర్ జీత భత్యాలు: నెలకు రూ. 23 వేల నుంచి రూ. లక్ష 5 వేలు
వయసు పరిమితి: 11/12/2022 నాటికి 29 ఏళ్లు దాటకూడదు.
దరఖాస్తు రుసుము: ఫీల్డ్ ఇంజనీర్ పోస్టులకి: రూ. 400/- ఫీల్డ్ సూపర్వైజర్ పోస్టులకు: రూ. 300/-