నేటికాలంలో బయటకు వెళ్ళిన మహిళలకు భద్రత అనేది లేకుండా పోయింది.
ఎప్పుడు ఎలా ఏ మూల నుంచి ఏ మానవ మృగం వస్తుందో తెలియదు.
మహిళలు తమను తాము రక్షించుకోవడానికి, పోకిరీల ఆగడాలకు చెక్ పెట్టడానికి ఓ కొత్త ఆవిష్కరణ జరిగింది.
మహిళలను లైంగిక వేధింపులకు గురి చేస్తే.. షాకిచ్చిందేకు ఓ ఇంటర్ కుర్రాడు ఎలక్ట్రిక్ చెప్పులను రూపొందించాడు.
ఎవరైన మహిళల పట్ల దురుసుగా ప్రవర్తిచినప్పుడు.. ‘చెప్పుతో కొడతా’ అని అంటారు.
అయితే ఈ ఎలక్ట్రిక్ చెప్పులతో తన్నితే చాలు అదే వారికి షాక్ కొడుతుంది.
ఝార్ఖండ్ లోని ఛత్రాకు చెందిన మంజీత్ కుమార్ ఈఎలక్ట్రిక్ చెప్పులను కనిపెట్టాడు.
అతడు ప్రస్తుతం ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు.
‘ఉమెన్ సేఫ్టీ డివైజ్’ పేరుతో మహిళలకు భద్రత కల్పించే ఎలక్ట్రిక్ చెప్పులను తయారు చేశాడు.
ఇతరుల సహాయం లేకుండా ఆడవాళ్లు పోకిరీల నుంచి తమను తాము కాపాడుకోగలుగుతారు.
2012లో ఢిల్లీలో నిర్భయ ఘటన జరిగినప్పుడు తనకు ఈ ఆలోచన వచ్చిందని తెలిపాడు.
నిర్భయ వంటి ఘటన మళ్ళీ జరగకూడదనే అతడు ఎలక్ట్రిక్ చెప్పులను తయారు చేశాడంట.
ఈ ఎలక్ట్రిక్ చెప్పులు అనేక మంది మహిళలకు ఆపద సమయంలో ఉపయోగపడితే చాలంట
జత చెప్పుల అడుగు భాగంలో నాలుగు బ్యాటరీలు, ఒక స్విచ్, ఇతర చిన్న పరికరాలను అమర్చారు.
ఈ చెప్పులు ఒక ఛార్జింగ్ పెట్టుకునేలా సీ టైప్ యూఎస్బీ పోర్ట్ ని కూడా అమర్చాడు.
ఒక అరగంట ఛార్జింగ్ పెడితే రెండు రోజుల వరకూ పని చేస్తుంది.
ఆ చెప్పులతో పోకిరీలను తన్నితే 220 నుంచి 300 వోల్టుల షాక్ తగులుతుందని మంజీత్ చెబుతున్నాడు..