మీరు టెన్త్ క్లాస్ పాసయ్యారా? అయితే మీ కోసమే ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.
మీకు డ్రైవింగ్ వస్తే కనుక కానిస్టేబుల్ డ్రైవర్ ఉద్యోగం పొందొచ్చు.
భారత హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీఎఫ్) కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
గ్రూప్ సి నాన్ గెజిటెడ్ (నాన్ మినిస్టీరియల్) విభాగంలో తాత్కాలిక ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనుంది.
పర్మినెంట్ ఉద్యోగం ఉండే అవకాశం కూడా ఉందని ఐబీపీఎఫ్ వెల్లడించింది.
అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ఐబీపీఎఫ్ కోరింది.
ఎంపికైన అభ్యర్థులు భారతదేశంలో ఎక్కడైనా గానీ లేదా విదేశంలో గానీ తమ సేవలను అందించాల్సి ఉంటుందని వెల్లడించింది.
ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, ఒరిజినల్ డాక్యుమెంట్స్ ధ్రువీకరణ, ప్రాక్టికల్ స్కిల్ టెస్ట్, మెరిట్ లిస్ట్, డిటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్, రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది.
మొత్తం కానిస్టేబుల్ డ్రైవర్ ఖాళీలు: 458
రిజర్వేషన్ వారీగా ఖాళీలు: యూఆర్: 195 ఎస్సీ: 74 ఎస్టీ: 37 ఓబీసీ: 110 ఈడబ్ల్యూఎస్: 42
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్స్టిట్యూషన్ లో మెట్రిక్యులేషన్ లేదా పదో తరగతి పాసై ఉండాలి. లేదా తత్సమాన ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
వయసు పరిమితి: 21 నుంచి 27 ఏళ్ల మధ్యలో ఉండాలి.
జీతం: నెలకు రూ. 21,700 నుంచి రూ. 69,100 వరకూ
పరీక్ష ఫీజు: జనరల్ అభ్యర్థులకు: రూ. 100/- ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులకు: ఫీజు లేదు
దరఖాస్తు చివరి తేదీ: జూలై 26