చలి గట్టిగా ఉంది. దీంతో నార్మల్ ప్రజలే కాదు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్లు ఇంకా ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు.
ఉష్ణోగ్రత తగ్గిపోతుండటంతో ఆస్తమా తీవ్రత బాగా పెరుగుతోంది. తరుచూ ఎటాక్స్ కూడా వస్తున్నాయి.
ఈ క్రమంలో పలువురు ఆస్తమా పేషెంట్స్.. ప్రస్తుతం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వీళ్లు దీన్ని కంట్రోల్ చేసుకోవడం పెద్ద కష్టమేమి కాదు.
శీతాకాలంలో ఉష్ణోగ్రత వల్ల ఆస్తమా ఇబ్బందిపెడుతున్నా సరే దాన్ని అదుపులో ఉంచుకోవచ్చు.
శీతాకాలంలో బాక్టీరియా, వైరస్ తో ఉండే గాలుల వల్ల ఆస్తమా రోగులకు చాలా ప్రాబ్లమ్.
చలికాలంలో ఆస్తమా రాకుండా ఉండటం కోసం రోజూ ఉల్లి, వెల్లుల్లి లాంటివి ఎక్కువగా తీసుకోవాలి.
ఆస్తమా తీవ్రమైనప్పుడు.. ఛాతీపై(చెస్ట్) గోరువెచ్చని నీటితో కాపడం పెట్టడం మంచిది.
యూకలిప్టస్ ఆయిల్ కొన్ని చుక్కల్ని నీటిలో కలిపి ఆవిరి పడితే ఆస్తమా తీవ్రత తగ్గుతుంది.
వాము పౌడర్ ని గ్లాస్ మజ్జిగలో కలిపి తీసుకుంటే కఫం పలుచగా అవుతుంది. వాము, బెల్లం కలిపి తీసుకున్నా సరే ఆస్తమా రోగులకు మంచిది.
ఆస్తమా రోగులు.. రోజువారీ జీవితంలో అల్లంని తప్పనిసరిగా ఉపయోగించాలి.
ఆస్తమా ఉన్నవారు.. పరగడుపున గోరువెచ్చటి నీటిలో కాస్త నిమ్మరసం కలిపి తీసుకున్నా సరే మంచి ఫలితం ఉంటుంది.
ఆస్తమా ఉన్నవాళ్లు.. తమ ఇంటి పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పొగ, దుమ్ము, ధూళికి దూరంగా ఉండాలి.
గదిని వెచ్చగా ఉండేలా చూసుకోవాలి. నిండుగా బట్టలు వేసుకోవాలి. చల్లని ఫుడ్ తినడమే పూర్తిగా మానేయాలి.
రగ్గులు, స్వెట్టర్లు పూర్తి శుభ్రం చేసిన తర్వాతే ధరించాలి. దీంతో ఆస్తమా కంట్రోల్లోకి వస్తుంది.
రోజూ కాసేపు నడవడం, ఈత కొట్టడం, యోగ, ప్రాణాయామం, బ్రీతింగ్ ఎక్సర్ సైజ్ చేయడం కూడా ఆస్తమా రోగులకు చాలా మంచిది.
నోట్: పైన టిప్స్ పాటించే ముందు మీ దగ్గర్లోని డాక్టర్, నిపుణుల సలహా తీసుకోండి.