అమెరికాకు చెందిన వైర్లెస్ నెట్ వర్క్ ఆపరేటర్ ‘వెరిజోన్’.. ఈ ఆఫర్ను అందుబాటులోకి తెచ్చింది.
ఈఎంఐ రూపంలో రూ.760 చెల్లించి ఐఫోన్ 13 ను సొంతం చేసుకోవచ్చు.
ప్రస్తుతానికి అమెరికాలోనిలోని కస్టమర్లకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉన్నప్పటికీ..
మరికొన్ని దేశాల్లో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.
అమెరికన్లు నెలకు 10 డాలర్లను సుమారు 36 నెలలు చెల్లించాల్సి ఉంటుంది.
అంటే ఆ ఫోన్ ధర ప్రస్తుత మార్కెట్లో 699 డాలర్లు (భారత్ కరెన్సీలో రూ.53,355.79) ఉండగా, ఈ ఆఫర్ దక్కించుకున్న యూజర్లకు 360 డాలర్లు (భారత్ కరెన్సీలో రూ.27,479.38) కే పొందవచ్చు.
అమెజాన్లో ఐఫోన్ 13 అసలు ధర రూ.79,900 కాగా, ఆఫర్ తరువాత రూ.74,900కు అందిస్తోంది.
అంతే కాదు మీ దగ్గర ఉన్న పాత మొబైల్ ఎక్స్ఛేంజ్ చేస్తే మీకు రూ.15,350 వరకు ధర తగ్గనుంది.
దీంతో ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద ఐఫోన్ 13 ధర రూ.59,550కు తగ్గుతుంది.
ఇంకా, ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉపయోగించి మొబైల్ కొనుగోలు చేససటే మీకు రూ.6,000 డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
అంటే, ఐఫోన్ 13 128జీబి వేరియంట్ రూ.53,550కు లభించనుంది. ఒకవేళ మీకు ఆసక్తి ఉన్నట్లయితే, ఈ ఆఫర్ ను ఒకసారి పరిశీలించండి.
మొత్తంగా ఈ మొబైల్ మీద రూ.26350(రూ.5000 + రూ.15,350 + రూ.6000 ) వరకు డిస్కౌంట్ లభిస్తోంది.
ఐఫోన్ 13 డిస్ప్లే 6.1 అంగుళాలు, మినీ డిస్ప్లే 5.4 అంగుళాలుగా ఉంటుంది.