మద్యం అమ్మకాల్లో ఎక్కువ డిమాండ్ ఉండేది బీర్కే.
బీర్ తయారీలో ప్రధానంగా వాడేవి మాల్ట్, ఈస్ట్, నీరు, హాప్స్.
బీర్ తయారు చేసి అభివృద్ధి చెందిన కథతో మన దగ్గర ఓ సినిమా కూడా వచ్చింది.
వాస్తవంగా కూడా ఇద్దరు స్నేహితులు.. విదేశాల్లో బీర్ తయారు చేసి.. బిజినెస్ చేస్తూ.. సక్సెస్ అయ్యారు.
కేరళకు చెందిన చంద్రమోహన్, సుకుమారన్ అనే ఇద్దరు స్నేహితులు. వీరు పోలాండ్‌లో నివాసం ఉంటున్నారు.
చంద్రమోహన్ ఇండో-పోలిష్ చాంబర్ ఆఫ్ కామర్స్ అనే సంస్థలో బిజినెస్ రిలేషన్స్ హెడ్‌గా పనిచేస్తుండగా.. సుకుమారన్ డిజైనర్‌గా పని చేసేవాడు.
ఈ క్రమంలో పోలాండ్‌కు చెందిన ఓ బిజినెస్ మ్యాన్ తృణధాన్యాల తయారీ కోసం ఇండియా, యూపీ నుంచి అటుకులు దిగుమతి చేసుకునేవాడు.
అయితే ఉక్రెయిన్ యుద్ధం కారణంగా.. అటుకుల డిమాండ్, ధరలో తేడా రావడంతో.. ఇండియా నుంచి వచ్చిన 20 వేల టన్నుల అటుకులు తనకు వద్దని చెప్పాడు.
ఆ సమయంలో చంద్రమోన్ వాటిని కొనుగోలు చేశాడు. అటుకులతో బీర్ తయారు చేయాలని భావించాడు.
దీని గురించి సుకుమారన్‌కు తెలిపాడు. వారిద్దరూ తమ ప్రాంతం పేరు కలిసి వచ్చేలా పేరు పెట్టి.. బీర్ల తయారీ ప్రారంభించారు.
బీర్ తయారీలో వీరికి.. అప్పటికే పోలాండ్‌లో బీర్ తయారు చేసి విజయం సాధించిన లిజో ఫిలిఫ్ అనే వ్యక్తిని కలిశారు.
లిజో ఫిలిఫ్ ‘కాలికట్ 1498’ పేరుతో సొంతంగా బీర్ తయారు చేసి.. పోలాండ్‌లో అమ్మకాలు ప్రారంభించాడు.
దాంతో చంద్రమోహన్.. తాము తయారు చేసే బీర్ విషయంలో లిజో ఫిలిఫ్ సాయం తీసుకున్నారు.
అలా అటుకులు, హాప్స్ కలిపి.. బీర్ తయారు చేశారు.
‘‘మలయాళీ స్పిరిట్స్’’ కంపెనీ పేరుతో వారిద్దరూ ఈ వ్యాపారం చేస్తున్నారు.